AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FDs Interest Rates: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే సూపర్ వడ్డీ

ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన విషయం. అప్పటి వరకూ ప్రతి నెలా జీతం రావడంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జీవితంగా సాఫీగా జరిగిపోతుంది. కానీ రిటైర్ మెంట్ తర్వాత జీతం రాదు. ప్రతి నెలా వచ్చే పింఛన్ పైనే ఆధారపడాలి. దానికి తోడు వయసు పెరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సరైన ప్రణాళిక అవసరం. ఇలాంటి సమయంలో వివిధ బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

FDs Interest Rates: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే సూపర్ వడ్డీ
Money Astrology 2025
Nikhil
|

Updated on: Dec 31, 2024 | 1:50 PM

Share

ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత మొత్తంలో సొమ్ము వస్తుంది. దాన్ని బ్యాంకుల్లో ఎఫ్ డీ చేయడం వల్ల నిర్ణీత వడ్డీ పొందవచ్చు. అయితే సురక్షిత, లాభదాయక పథకాలతో పాటు మంచి వడ్డీని అందించే బ్యాంకులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. రిటైర్డ్ ఉద్యోగులకు సీనియర్ సిటిజన్ కోటాలో వివిధ బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి. సుమారు ఐదేళ్ల కాలపరిమితికి రూ.రెండు కోట్ల కంటే తక్కవ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై 7.50 శాతం నుంచి 8 శాతానికి పైగా వడ్డీని కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. వాటిలో యాక్సిస్ బ్యాంకు 7.75, డీసీబీ 7.90, ఫెడరల్ బ్యాంక్ 7.75, హెచ్ డీఎఫ్ సీ 7.50, ఐసీఐసీఐ 7.50, ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.75, కరూర్ వైశ్యా బ్యాంక్ 7.50, ఆర్బీఎల్ 7.60, ఎస్బీఎం 8.25, ఎస్ బ్యాంకు 8, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 7.50 శాతం వడ్డీని అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకుల్లో 7 శాతం నుంచి 7.50 శాతం మధ్యలో వడ్డీరేట్లు అమలవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.40, ఐడీఎఫ్ సీ ఫస్ట్ 7.25, కెనరా బ్యాంక్ 7.20, ధనలక్ష్మి బ్యాంక్ 7.10 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఇండియన్ ఓవర్సీస్, పంజాబ్ నేషనల్, యూనియన్, డీబీఎస్, ఐడీబీఐ, జే అండ్ కే, కర్ణాటక, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లలో 7 చొప్పున శాతం వడ్డీని అందిస్తున్నారు.

బ్యాంకులు అమలు చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లలో తేడా ఉంటాయి. సాధారణ ఖాతాదారులో పోల్చితే వీరికి ఎక్కువ అందిస్తారు. సుమారు 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. వీరందరూ ఎఫ్ డీలపై అధిక వడ్డీలను పొందేందుకు అర్హులు. ఎన్ఆర్ఐ లేదా ఎన్ఆర్వో ఖాతాల ద్వారా ఎన్ఆర్ఐ సీనియర్ సిటిజన్లకు కూడా అవకాశం ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు సీనియర్ సిటీజన్లు తమ గుర్తింపు కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, పాన్ కార్డు, ఫోటో, టెలిఫోన్ లేదా విద్యుత్ బిల్లు అందజేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి