Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ఉద్యోగులకు మరో శుభ వార్త.. ఇకపై చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదు..!

తమ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకు, సంక్షేమానికి సైతం మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత రైల్వే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వం శాఖతో కలిసి వైద్య సేవల విస్తరణకు పూనుకుంది. వైద్య చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లకుండానే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈమేరకు జనవరి నెలలో ఆన్‌లైన్ సేవలు అందించే సంస్థల నుంచి టెండర్ల పిలవాలని భావిస్తోంది.

రైల్వే ఉద్యోగులకు మరో శుభ వార్త.. ఇకపై చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనిలేదు..!
Medicines Door Delivery
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 31, 2024 | 1:25 PM

మీరు రైల్వే ఉద్యోగి లేదా రిటైర్డ్ అయ్యారా..? ఇప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదు. మీకు ఇంట్లో కూర్చొని మందులు, చికిత్స పొందుతారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే కేవలం ప్రయాణ సౌకర్యాలను మాత్రమే కాకుండా, రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతకు, సంక్షేమానికి సైతం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత చికిత్స, మందులను కూడా అందిస్తుంది. ఈ సౌకర్యాలు పొందాలంటే ఆస్పత్రికి వెళ్లాల్సిందే. అయితే త్వరలో ఈ సేవలన్నీ ఇంట్లోనే అందుబాటులోకి రానున్నాయి.

భారతీయ రైల్వే తన ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన వారి ఆరోగ్య సంరక్షణ విధానంలో గణనీయమైన మార్పును చేసింది. రైల్వేలో తన ఉద్యోగులకు చికిత్స సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరుస్తుంది. రూ. 100 విలువైన కార్డు చూపితే రైల్వే ఉద్యోగులు నేరుగా ఎయిమ్స్, పీజీఐ వంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. ఉద్యోగులకు UMID కార్డు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సేవలకు తోడు ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది భారత రైల్వే. ఆన్‌లైన్ ఫార్మసీ సేవలతో చర్చలు జరుపుతోంది. రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈమేరకు జనవరి 2025లో టెండర్‌లను కోరాలని యోచిస్తోంది. రిటైల్ మెడిసిన్ ధరల నుండి తగ్గింపుల ఆధారంగా బిడ్డింగ్ ఉంటుంది. విజయవంతమైతే ఈ సేవను అన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని ఆసుపత్రులకు విస్తరించేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.

భారతీయ రైల్వేలు ప్రస్తుతం 129 ఆసుపత్రులు, 586 ఆరోగ్య విభాగాల ద్వారా సుమారు 10 మిలియన్ల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తోంది. ప్రధానంగా రైల్వే సిబ్బంది, పదవీ విరమణ పొందినవారు, వారి కుటుంబాలకు సేవలందిస్తోంది. లబ్దిదారులు భౌతికంగా రైల్వే ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలకు చికిత్సచ మందులు పొందడం కోసం రావాలి. ఈ రెండు సమస్యలను eSanjeevani – నేషనల్ టెలిమెడిసిన్ సర్వీస్ – ఔషధాల ఇంటింటి డెలివరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

మెడిసిన్ డెలివరీ సర్వీస్ రైల్‌టెల్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ద్వారా పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం అపాయింట్‌మెంట్ బుకింగ్‌లు, లాబొరేటరీ ఫలితాల యాక్సెస్, ఎలక్ట్రానిక్ వైద్య రికార్డులను నిర్వహిస్తుంది. 2017-2022 మధ్య రైల్వే ఆసుపత్రులలో హెల్త్‌కేర్ డెలివరీకి రూ. 20,734 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తంలో 11% మందుల కొనుగోళ్లు ఉన్నాయి. మొత్తం వ్యయంలో భారతీయ రైల్వే వార్షిక వ్యయంలో హెల్త్‌కేర్ 1-2% వెచ్చిస్తోంది. ఆగస్టులో పార్లమెంటుకు సమర్పించిన కాగ్ నివేదిక, రైల్వే ఆరోగ్య సేవల నిర్వహణలో పర్యవేక్షణ మరియు అంతర్గత నియంత్రణలను మెరుగుపరచడానికి ఉన్న అవకాశాలను ప్రస్తావించింది. 2022 కోసం జరిగిన ఆడిట్ ఔషధ నాణ్యత సేకరణ, సకాలంలో ప్రయోగశాల ఫలితాల పంపిణీకి సంబంధించిన సమస్యలను కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులకు డోర డెలివరీ ద్వారా మెడిసిన్ సరఫరా చేయాలని భారత రైల్వే శాఖ భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..