Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Interest Rates: ఆ బ్యాంకుల ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు భారీగా పెంపు

భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏళ్లుగా నమ్మకమైన పెట్టుబడి సాధనంగా మారాయి. ముఖ్యంగా రిటైరైన వాళ్లు మంచి రాబడి కోసం కచ్చితంగా ఎఫ్‌డీల్లో పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో దేశంలోని కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తాజాగా సవరించాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

FD Interest Rates: ఆ బ్యాంకుల ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు భారీగా పెంపు
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Feb 02, 2025 | 5:00 PM

ఫిబ్రవరి 7న జరిగే ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం కంటే ముందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లతో సహా అనేక బ్యాంకులు జనవరిలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశానికి ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను మార్చాయి. జనవరిలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చి ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై ఏ స్థాయిలో వడ్డీ రేట్లు పెరిగాయో? తెలుసుకుందాం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

ఏడు శాతం వడ్డీ రేటుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 303 రోజుల కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ను లాంచ్ చేసింది. సాధారణ పౌరులకు 6.7 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.50 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 400 రోజుల పదవీకాలం అత్యధిక వడ్డీ రేటు 7.25 శాతం అందిస్తుంది.

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అప్‌డేట్ చేసినట్లు పేర్కొంది. బ్యాంక్ అందించే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు సాధారణ పౌరులకు 3.50 శాతం నుంచి 8.80 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుండి 9.30 శాతం వరకు ఉంటాయి. ఈ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు జనవరి 22 నుండి అమలులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

కర్ణాటక బ్యాంక్

కర్ణాటక బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలానికి 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 375 రోజులకు, అత్యధికంగా 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు జనవరి 2 నుంచి సవరించారు. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రూ. 3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంక్ మార్చింది. ఫలితంగా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ రేట్లు ఇప్పుడు 3.5 శాతం నుంచి 7.30 శాతం మధ్య ఉన్నాయి. 456 రోజులకు సాధారణ పౌరులకు అత్యధిక వడ్డీ రేటు 7.30 శాతం అందుబాటులో ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి.

యాక్సిస్ బ్యాంక్

రూ. 3 కోట్లు కంటే తక్కువ ఎఫ్‌డీల కోసం యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు జనవరి 27 నుంచి అమలులోకి వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్కూటర్ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. స్టోరేజీ కూడా ముఖ్యమే..!
స్కూటర్ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. స్టోరేజీ కూడా ముఖ్యమే..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ ఆయిల్‌ ది బెస్ట్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ ఆయిల్‌ ది బెస్ట్‌..!
ఇద్దరు యువకుల దారుణహత్య..!
ఇద్దరు యువకుల దారుణహత్య..!
పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా CC కెమెరాలు
పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా CC కెమెరాలు
గోల్డ్‌ స్మగ్లింగ్‌తో కస్టమ్స్‌ అధికారులకే ఝలక్‌.. శరీరంలో బంగారం
గోల్డ్‌ స్మగ్లింగ్‌తో కస్టమ్స్‌ అధికారులకే ఝలక్‌.. శరీరంలో బంగారం
'కెడీ' సెట్స్‌కి వెళ్లిన డైరెక్టర్ పూరి జగన్నాథ్..
'కెడీ' సెట్స్‌కి వెళ్లిన డైరెక్టర్ పూరి జగన్నాథ్..
ప్రభాస్ ఫ్యాన్స్‌తో మాములుగా ఉండదు మరి.. ఏకంగా సలార్ ఫిట్‌ను..
ప్రభాస్ ఫ్యాన్స్‌తో మాములుగా ఉండదు మరి.. ఏకంగా సలార్ ఫిట్‌ను..
కొత్త టియాగో లుక్ అదరహో.. 2025 మోడల్ ఈవీ విడుదల
కొత్త టియాగో లుక్ అదరహో.. 2025 మోడల్ ఈవీ విడుదల
పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? మధుమేహులకు!
పచ్చి కొబ్బరి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..? మధుమేహులకు!
ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా..? ఈ ప్రేమ జంట పెట్టిన షరతులు చూస్తే
ఇలాక్కూడా పెళ్లి చేసుకుంటారా..? ఈ ప్రేమ జంట పెట్టిన షరతులు చూస్తే