AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: కేంద్రం నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు చేతి నిండా డబ్బులే.. ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారంటే..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిడిల్ క్లాస్ ఫుల్ హ్యాపీగా ఉంది. రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికేమీ నష్టం లేదా..? ఎందుకంత సంచలన నిర్ణయం తీసుకుందన్న చర్చ మొదలైంది. నిజానికి ఇలా పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాకు దాదాపుగా రూ.లక్ష కోట్ల వరకూ నష్టం వాటిల్లుతుంది.

Budget 2025: కేంద్రం నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు చేతి నిండా డబ్బులే.. ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారంటే..
Budget 2025
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2025 | 12:17 PM

Share

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మిడిల్ క్లాస్ ఫుల్ హ్యాపీగా ఉంది. రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికేమీ నష్టం లేదా..? ఎందుకంత సంచలన నిర్ణయం తీసుకుందన్న చర్చ మొదలైంది. నిజానికి ఇలా పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల కేంద్ర ఖజానాకు దాదాపుగా రూ.లక్ష కోట్ల వరకూ నష్టం వాటిల్లుతుంది. అంటే ఆ మేరకు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అయినా…ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అందుకు కారణం..మధ్యతరగతి వాళ్లకి ఊరటనివ్వాలన్న ఉద్దేశమే. పైగా ఈ మధ్య కాలంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. ద్రవ్యోల్బణం కారణంగా అన్ని ధరలూ పెరిగిపోయాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్లకి ఇదో భారంగా మారింది. క్రమంగా వాళ్లు ఖర్చులు తగ్గించుకుంటూ వస్తున్నారు. కొత్త వస్తువులు కొనాలన్న ఆలోచన మానుకుంటున్నారు. ఇదంతా ఇన్‌డైరెక్ట్‌గా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రజల చేతుల్లో డబ్బులు లేకపోతే అది ఎకనామికల్ సైకిల్ ఆగిపోతుంది.

ఈ సైకిల్ కంటిన్యూ అవ్వాలంటే కచ్చితంగా సామాన్యుల చేతులో డబ్బులు ఉండాలి. అది జరగాలంటే పన్నులు తగ్గించాలి. ఇప్పుడు కేంద్రం చేసింది అదే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..దేశ జీడీపీ దాదాపు 60% మేర కొనుగోలు శక్తిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే..జీడీపీ బాగుండాలంటే ప్రజల్లో కొనుగోలు శక్తిని తప్పకుండా పెంచాలి. రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునివ్వడం వల్ల ఆ మేరకు డబ్బు ఆదా అవుతుంది. అలాంటప్పుడు వాళ్లు గూడ్స్ అండ్ సర్వీసెస్‌పై ఎక్కువగా ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది క్రమంగా కొనుగోలు శక్తిని పెంచుతుంది. తద్వారా ఇన్‌డైరెక్ట్‌ పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

ఎలా చూసినా…అటు మధ్యతరగతి ప్రజలకు, ఇటు కేంద్రానికి ఉపయోగపడే నిర్ణయం. పైగా…ఇదంతా పరోక్షంగా ఇన్వెస్ట్‌మెంట్‌లకు మంచి బూస్ట్ ఇవ్వడంతో పాటు ఉద్యోగాల సృష్టికీ చేయూతనిస్తుంది. అయితే…ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణల ఆధారంగా చూస్తే.. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రభావాన్ని చూసేందుకు కనీసం మూడేళ్లైనా పడుతుండొచ్చు. ఈ లోగా మార్కెట్‌కి కాస్త ఊపు వస్తుందని వాళ్లు అభిప్రాయ పడుతున్నారు. రూ.10 లక్షల వరకూ ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుండొచ్చు అని బడ్జెట్‌కి కొద్ది రోజుల ముందు నుంచే ప్రచారం జరిగింది. కానీ.. ప్రభుత్వం ఏకంగా రూ.12 లక్షల వరకూ ఈ మినహాయింపు ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇది ఎవరూ ఊహించనిదే అయినా..సామాన్యులకు మాత్రం భారీ ఊరటనిచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల