Income Tax: రూ.12 లక్షల ఆదాయం ఉన్నా పన్ను కట్టాల్సిందే.. కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారా?
Income Tax: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2025న సమర్పించారు. ఈ బడ్జెట్‌లో సాధారణ ప్రజలకు రూ. 12 లక్షల వరకు ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రూ.12 లక్షల ఆదాయం ఉన్నా పన్ను కట్టాల్సిందే. ఇదేంటి కొత్తగా అనుకుంటున్నారా? అసలు విషయానికొస్తే..

శనివారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తూ మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చారు. 12 లక్షల ఆదాయంపై ఇప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి తెలిపారు. కానీ క్యాపిటల్ గెయిన్స్, లాటరీ ద్వారా మీ ఆదాయం రూ. 12 లక్షల వరకు ఉంటే, అప్పుడు మీరు పన్ను చెల్లించాలి. దీనికి కారణం సెక్షన్ 87A కింద ప్రత్యేక రేటు ఆదాయంపై రాయితీ వర్తించదు. లాటరీ, దీర్ఘకాలిక మూలధన లాభాల ద్వారా వచ్చే ఆదాయం ప్రత్యేక రేటింగ్ ఆదాయంగా పరిగణిస్తారు.
సెక్షన్ 87A పన్ను మినహాయింపు అంటే ఏమిటి?
పాత పన్ను విధానంలో వారి మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే, అర్హులైన పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 87A కింద ఆదాయపు పన్ను నుండి పూర్తి మినహాయింపు పొందుతారు. బడ్జెట్ 2025 ప్రతిపాదన ప్రకారం.. మొత్తం ఆదాయం రూ.12 లక్షలకు మించకుంటే ఈ మినహాయింపు లభిస్తుంది. పాత పన్ను విధానంలో సెక్షన్ 87A కింద గరిష్ట పన్ను మినహాయింపు రూ.12,500 కాగా, కొత్త పన్ను విధానంలో దీన్ని రూ.60,000కు పెంచాలని ప్రతిపాదించారు.
దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను:
ప్రభుత్వం రాయితీ పరిమితిని రూ.60,000కు పెంచింది. మీ ఆదాయం రూ. 12 లక్షలు అయితే అందులో రూ. 8 లక్షలు జీతం, రూ. 4 లక్షలు దీర్ఘకాలిక మూలధన లాభం లేదా లాటరీ ద్వారా వచ్చినట్లయితే 87A కింద రాయితీ కేవలం రూ. 8 లక్షల ఆదాయంపై మాత్రమే లభిస్తుందని అనుకుందాం. అయితే రూ. 4 లక్షలు ప్రత్యేక పన్నుకు లోబడి ఉంటుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను రేటు 12.5 శాతంగా ఉంది.
మీరు ITR నుండి రాయితీ ప్రయోజనం:
ఇంతకుముందు ఒక వ్యక్తి రూ.12 లక్షల ఆదాయంపై రూ.80,000 పన్ను చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు వసూలు చేయడం లేదు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రూ.80,000 ఆదా అవుతుంది. ఇప్పుడు రూ. 12 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను చెల్లింపుదారు రిబేట్ పొందేందుకు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Budget 2025: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు మంచి రోజులు.. బడ్జెట్‌లో గుడ్‌న్యూస్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి