Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు మంచి రోజులు.. బడ్జెట్‌లో గుడ్‌న్యూస్‌

Budget 2025: పే ఫర్ వర్క్ ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను గిగ్ వర్కర్స్ అంటారు. అయితే ఇలాంటి ఉద్యోగులు కంపెనీలతో సుదీర్ఘకాలం పాటు అనుబంధం కలిగిన వారు చాలా మందే ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో స్వతంత్రంగా పనిచేసే ఉద్యోగులు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే ఉద్యోగులు, కాల్ ఆన్ వర్క్స్ అందుబాటులో ఉన్న ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు ఉన్నారు..

Budget 2025: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు మంచి రోజులు.. బడ్జెట్‌లో గుడ్‌న్యూస్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 02, 2025 | 7:19 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, శనివారం దేశ సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు. దీనిలో ప్రభుత్వం కార్మికుల కోసం పెద్ద ప్రకటన చేసింది. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులను అందజేస్తుందని చెప్పారు. దీనితో పాటు, ఈ తాత్కాలిక కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా పొందవచ్చు. ఈ నిర్ణయం తర్వాత ఈ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించిన ఉద్యోగులు వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ప్రభుత్వ సౌకర్యాలను పొందగలుగుతారు.

కోటి మంది గిగ్ వర్కర్లకు సహాయం చేయడానికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇ-శ్రమ్ ప్లాట్‌ఫారమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాట్లు చేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇ-కామర్స్ కంపెనీలకు డెలివరీ సేవలను అందించే ఉద్యోగులు గిగ్ వర్కర్ల వర్గంలోకి వస్తారు. వీరిలో Uber, Ola, Swiggy, Zomato వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన వ్యక్తులు ఉన్నారు.

గిగ్ వర్కర్లు అంటే ఎవరు?

ఇవి కూడా చదవండి

పే ఫర్ వర్క్ ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను గిగ్ వర్కర్స్ అంటారు. అయితే ఇలాంటి ఉద్యోగులు కంపెనీలతో సుదీర్ఘకాలం పాటు అనుబంధం కలిగిన వారు చాలా మందే ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో స్వతంత్రంగా పనిచేసే ఉద్యోగులు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే ఉద్యోగులు, కాల్ ఆన్ వర్క్స్ అందుబాటులో ఉన్న ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు ఉన్నారు.

గిగ్ వర్కర్లకు ఇది సామాజిక భద్రతను అందిస్తుంది. ఆరోగ్య సమస్యల ఉన్నవారు ఆరోగ్య బీమా వాడుకోవచ్చు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గిగ్ వర్కర్లకు ఒక పెద్ద అడుగుగా కాబోతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కార్మికులు లేదా గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థకు గొప్ప సాయాన్ని అందిస్తారని మంత్రి చెప్పుకొచ్చారు.

గిగ్ వర్కర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకుంటోంది?

ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, లాజిస్టిక్స్, ఆన్‌లైన్ సేవల్లో లక్షలాది మంది గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వారి ఉపాధి తాత్కాలికమే తప్ప కంపెనీలు ఎలాంటి అదనపు భద్రత, ప్రయోజనాలు ఇవ్వవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గిగ్ ఎకానమీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

2025-26 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ, పట్టణ కార్మికుల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం ఒక పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థకు గొప్ప చైతన్యాన్ని అందిస్తారని అన్నారు. వారి సహకారాన్ని గుర్తించి మా ప్రభుత్వం వారి గుర్తింపు కార్డులు, ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. అటువంటి కార్మికులకు ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) కింద ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించనుంది. ఈ చర్య సుమారు కోటి మంది కార్మికులకు సహాయం చేసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలకు చెందిన 12 పథకాలు ఇ-శ్రమ్ పోర్టల్‌తో అనుసంధానించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి