Income Tax: ఎంత సంపాదిస్తే పన్ను లేదు.. ఇన్‌కమ్ ట్యాక్స్ లెక్కలు ఇవి..!
Union Budget 2025: సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు..

మధ్యతరగతి, వేతన జీవులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చన్న అంచనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిజం చేశారు. 12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంతే కాకుండా ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకృతం చేసేందుకు కొత్త చట్టాన్ని కూడా ఆయన ప్రకటించారు. వచ్చే వారం కొత్త బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పన్ను రహితం అని నిర్మలా సీతారామన్ ప్రకటించినందున, జీతం ఉన్నవారికి ఎంత పన్ను మినహాయింపు ఇస్తారు అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అంత సంపాదిస్తే పన్ను లేదు:
ఈ మునుపటి పన్ను విధానంలో 10 లక్షల వరకు రూ. 50,000 వరకు పన్ను కట్టాల్సి ఉండేది. ఇప్పుడు ప్రకటించినట్లుగా రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. దీంతో జీతాల వర్గానికి రూ.50 వేల లాభం పొందినట్లవుతుంది. గతంలో రూ.12 లక్షల వరకు ఆదాయానికి రూ.80,000 పన్ను ఉండేది. ఇప్పుడు జీరో ట్యాక్స్ ఉంది. ఆ విధంగా జీతం కేటగిరీ వారు 80,000 వరకు పొదుపు చేసుకోవచ్చు.
ఎంత పన్ను ఆదా? ఇదిగో లెక్క
- రూ.15 లక్షల వరకు ఆదాయం నేటి పన్ను విధానంలో రూ.1.40 లక్షలు పన్ను కట్టాల్సి ఉండేది. ప్రస్తుతం రూ.45,000 మాత్రమే కట్టాలి. ఇందులో మీకు రూ.95 వేల వరకు పొదుపు ఉంటుంది.
- రూ.20 లక్షలు వరకు ఆదాయానికి మునుపటి పన్ను విధానంలో 2.90 లక్షల పన్ను విధించేవారు. ప్రస్తుతం 1.40 లక్షల పన్ను విధిస్తున్నారు. దీని నుంచి రూ.1.50 లక్షల వరకు పొదుపు ఉంటుంది.
- రూ.24 లక్షల వరకు ఆదాయంపై మునుపటి పన్ను విధానంలో 4.10 లక్షలు పన్ను విధిస్తే ఇప్పుడు కొత్త విధానంలో రూ.2.40 లక్షలు అవుతుంది. పన్ను విధిస్తారు. దీని నుంచి రూ.1.70 లక్షల వరకు పొదుపు ఉంటుంది.
- రూ.30 లక్షలు వరకు ఆదాయం కోసం మునుపటి పన్ను విధానంలో 5.90 లక్షల వరకు పన్ను విధిస్తే ఇప్పుడు రూ.4.20 లక్షలు. దీని నుంచి రూ.1.70 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు.
- రూ.50 లక్షల వరకు ఉన్న ఆదాయం కోసం మునుపటి పన్ను విధానంలో 11.90 లక్షలు పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు పన్నును రూ.10.20 లక్షలకు తగ్గించారు. దీని నుంచి రూ.1.70 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి