Income Tax: పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
Union Budget 2025: సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేంద్ర వార్షిక బడ్జెట్ 2025 రానే వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు..

పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపిస్తున్నారు. ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం బడ్జెట్‌లో శుభవార్త అందించారు మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త అందించారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని మంత్రి నిర్మల్మ ప్రకటించారు. ఇదిలా ఉండగా, వచ్చేవారం కొత్త ఆదాయపు పన్ను చట్టం చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఆదాపు పన్ను ప్రకటన మధ్యతరగతి వారికి ఊరట కలిగేలా ట్యాక్స్ విధానమనే చెప్పాలి. భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం తీసుకురానున్నారు. TDS, TCS రేట్ల తగ్గింపు ఉంటుంది. అలాగే అద్దె ఆదాయంపై TDS రూ.6 లక్షలకు పెంపు ఉండగా, వడ్డీ ఆదాయంపై రూ. 2లక్షలకు పెంపు ఉంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, ” I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs.” pic.twitter.com/rDUEulG3b9
— ANI (@ANI) February 1, 2025
- రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు
- రూ.16లక్షల నుంచి 20 లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్ను
- రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25% పన్ను
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి