Union Budget 2025: మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన

Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వానికి ఇది రెండో పూర్తిస్థాయి బడ్జెట్‌. అదే సమయంలో నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌లో పలు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు సంబంధించిన మెడికల్‌ సీట్లపై కీలక ప్రకటన చేశారు..

Union Budget 2025: మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2025 | 12:00 PM

Budget 2025: పార్లమెంట్లో మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ 2025 ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో పలు రంగాలకు వరాలు కురిపించారు. రైతులతో పాటు వివిధ రంగాల అంశాలపై ప్రకటనలు చేస్తున్నారు. అలాగే మెడికల్‌ కాలేజీలో సీట్ల పెంపుపై ప్రకటన చేశారు. వైద్య విద్యార్థుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలో 10 వేల సీట్లు పెంచుతామని వెల్లడించారు. అలాగే ఐటీ సామర్థ్యం పెరిగిందని, 5 IITలలో అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించనున్నట్లు చెప్పారు. IIT పాట్నా విస్తరించనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త యూజీ మెడికల్ సీట్లను ప్రభుత్వం చేర్చనుంది మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

డాక్టర్లు కావాలని కలలు కనే వారికి ఇది శుభవార్త. ఇప్పుడు దేశంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది MBBS లో ప్రవేశం పొందడం సులభతరం చేస్తుంది. మెడిసిన్ చదివే వారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో అనేక బహుమతులు ఇచ్చారు.

దేశంలోని వైద్య కళాశాలల్లో ఇప్పుడు మొత్తం 1,12,112 MBBS సీట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రతి సంవత్సరం అడ్మిషన్ కోసం పోరాటం జరుగుతుంది. ఈ సీట్లకు నీట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. 2014 సంవత్సరం వరకు మొత్తం MBBS సీట్లు 51348 ఉండగా, 2014 వరకు దేశంలో మొత్తం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జూలై 2024 వరకు ఉన్న డేటా ప్రకారం.. ఇప్పుడు దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 731. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కూడా పెంచారు. 2014 వరకు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 31185 కాగా, జూలై 2024 నాటికి ఈ సీట్ల సంఖ్య 72627కి పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బడ్జెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

శభాష్ పోలీసన్న.. నిలబడిన నిండు ప్రాణం!
శభాష్ పోలీసన్న.. నిలబడిన నిండు ప్రాణం!
శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రారంభించిన తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్
శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రారంభించిన తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్
హీరోల దగ్గరకే ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..
హీరోల దగ్గరకే ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??
కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
షోకాజ్‌ నోటీసులపై తీన్మార్‌ మల్లన్న కీలక వ్యాఖ్యలు!
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..