Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays In February 2025: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో అంటే..

బ్యాంక్‌లు హాలిడేస్‌ తీసుకున్నప్పటికీ, ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా బ్యాంకింగ్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ATMల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇవి 24 గంటలూ పని చేస్తాయి..

Bank Holidays In February 2025: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో అంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2025 | 6:44 AM

మీకు ఫిబ్రవరిలో బ్యాంకులకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి. లేకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. దానికి కారణం కూడా ఉంది. ఫిబ్రవరి నెలలో సగం వరకు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఫిబ్రవరి నెలలో కొన్ని పండుగలు ఉన్నాయి. ఈ సమయంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఉంటాయి.

ఫిబ్రవరి 3వ తేదీన సరస్వతీ పూజ, ఫిబ్రవరి నెలలోనే తైపూసం, గురు రవిదాస్ జయంతి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి, మహాశివరాత్రి వంటి అనేక పండుగలు ఉన్నాయి. వీటిలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దేశం మొత్తం ఆర్బీఐ సెలవు క్యాలెండర్‌లో మొత్తం 14 బ్యాంకులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏ తేదీలో, ఏ కారణంతో ఏ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో చూద్దాం.

ఫిబ్రవరి బ్యాంకు సెలవుల జాబితా

➦ ఫిబ్రవరి 02, ఆదివారం – బ్యాంకులకు వారంతపు సెలవు

➦ ఫిబ్రవరి 03, సోమవారం – సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసి ఉంటాయి.

➦ ఫిబ్రవరి 08, శనివారం – రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే

➦ ఫిబ్రవరి 09, ఆదివారం – బ్యాంకులకు వారంతపు సెలవు

➦ ఫిబ్రవరి 11, మంగళవారం – థాయ్ పూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులకు సెలవు

➦ ఫిబ్రవరి 12, బుధవారం – శ్రీ రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు

➦ ఫిబ్రవరి 15, శనివారం – ఇంఫాల్‌లో Lui-Ngai-Ni సందర్భంగా బ్యాంకులకు సెలవు

➦ ఫిబ్రవరి 16, ఆదివారం – బ్యాంకులకు వారంతపు సెలవు

➦ ఫిబ్రవరి 19, బుధవారం – ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు హాలిడే

➦ ఫిబ్రవరి 20, గురువారం – మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అవతరణ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్‌లు మూసి ఉంటాయి.

➦ ఫిబ్రవరి 22, శనివారం – నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు

➦ ఫిబ్రవరి 23, ఆదివారం – బ్యాంకులకు ఆదివారం వారం సెలవు

➦ ఫిబ్రవరి 26, బుధవారం – మహా శివరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

➦ ఫిబ్రవరి 28, శుక్రవారం – లోసార్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

సెలవుల సమయంలో బ్యాంకింగ్ సేవలు

బ్యాంక్‌లు హాలిడేస్‌ తీసుకున్నప్పటికీ, ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా బ్యాంకింగ్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. UPI, IMPS, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రజలు 24 గంటలూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ATMల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇవి 24 గంటలూ పని చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి