AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Registration Charges: ఏపీలో నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు

AP Registration Charges: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ల చేపట్టారు అధికారులు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద కొనుగోలుదారుల రద్దీ కొనసాగుతోంది..

AP Registration Charges: ఏపీలో నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు
Subhash Goud
|

Updated on: Feb 01, 2025 | 7:57 AM

Share

ఏపీ రాష్ట్రంలో ఈరోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుండటంతో.. గత రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ధరలు పెరగకముందే తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో కొన్నిచోట్ల సర్వర్లు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ల చేపట్టారు అధికారులు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద కొనుగోలుదారుల రద్దీ కొనసాగుతోంది.

గురువారం ఒక్క రోజే 14,250 రిజిస్ట్రేషన్లు నమోదు:

గడిచిన రెండు రోజుల్లో సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. గురువారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 14,250 రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. ఒక్కరోజులోనే ప్రభుత్వానికి రూ. 107 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. శుక్రవారం కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మామూలుగా అయితే ప్రతి రోజు సగటున 7 వేల నుంచి 8 వేల వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీని వల్ల రూ.25-30 కోట్ల వరకు ఆదాయం వస్తుంటుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184, ఎన్టీఆర్ జిల్లాలో 946, ప్రకాశం జిల్లాలో 944 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా అల్లూరి జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగని పరిస్థితి ఉంది.

గత మూడ్రోజుల నుంచి 150 నుంచి 170 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో సర్వర్లూ సైతం మొరాయించాయి. ఇటు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రాష్ట్రంలో ఎక్కడాలేని రద్దీ కనిపిస్తోంది. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20 శాతం మధ్య ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..