Budget 2025: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్.. మోదీ 3.0 సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే..
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు 2025 బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు 2025 బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ శ్రేయస్సు.. వలసలను పరిష్కరించడానికి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులతోపాటు.. ఆరు రంగాల్లో సమూల మార్పుల కోసం నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో కొత్త పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని.. అలాగే.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు రుణ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.
ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు.
దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన, పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం, కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం.. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం అమలు చేస్తామన్నారు.
Budget 2025 LIVE: కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..