Budget 2025 Updates: ఈ సారి బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిర్మలమ్మ చీర..! ఇదో అరుదైన బహుమతి
ఇది ఆమె ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావటం మరో విశేషం. కోట్లాది ప్రజల భవితవ్యానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. ఇక్కడ మరో విషయం కూడా ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. అదేంటంటే... నిర్మలమ్మ ధరించిన చీర..అవును.. బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు ఎప్పుడు ప్రత్యేక వార్తే అవుతుంది..

ఫిబ్రవరి 1.. యావత్ దేశవ్యాప్తంగా ఒకటే ఉత్కంఠ, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నరోజు.. అది ఎందుకే మనందరికీ తెలిసిందే..! ఎన్డీఏ కూటమి కింద మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడవ సారి అధికారంలోకి వచ్చింది. ఇక మోదీ 3.0 ప్రభుత్వంలో రెండవసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ఆమె ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావటం మరో విశేషం. కోట్లాది ప్రజల భవితవ్యానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. ఇక్కడ మరో విషయం కూడా ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. అదేంటంటే… నిర్మలమ్మ ధరించిన చీర..అవును.. బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కట్టుకునే చీరలు ఎప్పుడు ప్రత్యేక వార్తే అవుతుంది..
బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐకానిక్ చీరలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఈ సంవత్సరం ఆమె కట్టుకున్న చీర ఆహ్లాదకరమైన బంగారు వర్క్ తో కూడిన పాలలాంటి తెల్లటి చీరలో, రుద్రబంగారపు బ్లౌజు ధరించి కనిపించారు. చేతిలో బడ్జెట్ పత్రులు షాలువాతో బడ్జెట్ ప్రసంగానికి బయలుదేరారు. ఆమె వస్త్రాధారణ, చీరల ఎంపికలలో చేనేత, హస్తకళాలపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది.
అయితే, ఈ చీర విశేషం ఏంటంటే..2021లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన వెనుకబడిన వర్గానికి చెందిన దులారీ దేవి ఈ చీరను సీతారామన్‌కు బహుకరించారు. మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్రీచ్ యాక్టివిటీ కోసం మధుబని సందర్శించిన సందర్భంగా ఆర్థిక మంత్రి దులారీ దేవిని కలిశారు. బీహార్‌లోని మధుబని కళపై ఇద్దరూ సహృదయపూర్వకంగా ఆలోచనలు చేసుకున్నారు. దులారీ చీరను బహుకరించి, బడ్జెట్ రోజున దానిని ధరించాలని కేంద్ర మంత్రిని కోరారు. మధుబని కళకు, దులారీ దేవి నైపుణ్యానికి నివాళిగా ఆర్థిక మంత్రి ఆమె బహుమతిగా ఇచ్చిన చీరను ధరించారు.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman leaves from the Ministry of Finance.
She will present and read out the #UnionBudget2025 at the Parliament through a tab, instead of the traditional ‘bahi khata’. pic.twitter.com/89XblFTwmk
— ANI (@ANI) February 1, 2025
2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామ్ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. ఆ సమయంలో బడ్జెట్ ఖాతాను అందుకుని రక్తరంగు బ్రీఫ్ కేసుతో పింక్ మంగళగిరి సిల్క్ సారీ ధరించి కనిపించారు.. ఈ సారీకి బంగారు వర్క్ కూడా ఉంది.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి