AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ రాజధానిలో లక్కీ భాస్కర్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్లు స్వాహా..! కట్ చేస్తే..

సినిమా స్టైల్లో డబ్బు సంపాదించేందుకు వెళ్లిన ఓ యువకుడు.. ఊహించని విధంగా పోలీసులకు చిక్కిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన రూ. 7 కోట్లు బెట్టింగ్‌లో పెట్టాడు. కంపెనీ కరెంటు బిల్లు కట్టకుండా ఆ డబ్బుతో బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టాడు. ఆడిటింగ్‌లో ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఐటీ రాజధానిలో లక్కీ భాస్కర్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్లు స్వాహా..! కట్ చేస్తే..
Lucky Bhaskar
Jyothi Gadda
|

Updated on: Jan 29, 2025 | 8:45 PM

Share

ఇటీవల తెలుగులో వచ్చిన లక్కీ భాస్కర్‌ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో హీరో తాను పనిచేస్తున్న బ్యాంకులో డబ్బు దొంగిలించి వేరే చోట పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదిస్తాడు. కనీసం హింట్ కూడా ఇవ్వకుండా నటుడు తప్పించుకుంటాడు. ఇది ఒక సినిమా కథ..కానీ, ఐటీ రాజధాని నగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.7 కోట్ల మేర ఓ ప్రైవేట్ సంస్థ సిబ్బంది చేతిలో నష్టపోయింది.. బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి చివరకు పోలీసులకు చిక్కాడు.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ను అశోకనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుడు శ్రీకాంత్ ఓ ప్రైవేట్ కంపెనీలో అసోసియేట్ అకౌంటెంట్‌గా వివిధ కంపెనీలకు అకౌంటింగ్ సేవలు అందిస్తున్నాడు. స్విగ్గీ ఇండియా విద్యుత్ బిల్లు చెల్లించేందుకు శ్రీకాంత్‌ను నియమించారు. అయితే గతేడాది జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు కంపెనీ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.7 కోట్ల సొమ్మును శ్రీకాంత్‌ తన సొంత పనులకు వినియోగించుకున్నట్టుగా సంస్థ గుర్తించింది.. అతను బెట్టింగ్ యాప్‌లో ఈ డబ్బును పెట్టుబడి పెట్టాడని గుర్తించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by G2G.News (@g2g.news)

జనవరిలో జరిగిన స్విగ్గీ ఆడిటింగ్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ప్రశ్నించగా బెట్టింగ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అనంతరం అశోకనగర్ పోలీస్ స్టేషన్‌లో కంపెనీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా అశోకనగర్ పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..