AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పోతావురా రేయ్..ఇలాంటి సినిమా స్టంట్లు చేస్తే ఖచ్చితంగా పైకే పోతావ్‌..! ఇంతకీ ఏం చేశాడంటే..

తాజాగా అలాంటిదే ఒక మూవీలో హీరో చేసిన స్టంట్‌ చేస్తున్న కొందరు యువకుల వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన 'ఏక్ థా టైగర్' సినిమా నుండి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి ఎవరూ ఊహించని ప్రమాదకరమైన విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో అందరూ షాక్ అయ్యారు.

Watch: పోతావురా రేయ్..ఇలాంటి సినిమా స్టంట్లు చేస్తే ఖచ్చితంగా పైకే పోతావ్‌..! ఇంతకీ ఏం చేశాడంటే..
Man Pulls Down Pantograph
Jyothi Gadda
|

Updated on: Jan 28, 2025 | 4:31 PM

Share

కొంతమంది సినిమాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటి వారు రీల్ జీవితాన్ని రియల్‌ లైఫ్‌లో అనువదించడానికి ట్రై చేస్తుంటారు. పైగా ఇటీవలి కాలంలో యువతలో రీల్స్‌ పిచ్చి బాగా పెరిగిపోయింది. దీని ప్రభావంతో సినిమా స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వ్యూస్‌, లైకుల కోసం ఆరాటపడుతున్నారు. తాజాగా అలాంటిదే ఒక మూవీలో హీరో చేసిన స్టంట్‌ చేస్తున్న కొందరు యువకుల వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘ఏక్ థా టైగర్’ సినిమా నుండి ప్రేరణ పొందిన ఓ వ్యక్తి ఎవరూ ఊహించని ప్రమాదకరమైన విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో అందరూ షాక్ అయ్యారు.

సల్మాన్‌ఖాన్‌ అభిమానులు, సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లకు ‘ఏక్ థా టైగర్’లోని ఆ దృశ్యం గుర్తుండే ఉంటుంది. అక్కడ సల్మాన్ ఖాన్ రైలు పైకి ఎక్కి పరిగెత్తాడు. రైలు ఢీకొట్టబోతుందని తెలుసుకున్నప్పుడు, అతను తన కోటు తీసి ఆ పైనున్న ఇనుప కడ్డీకి వేసి లాగుతాడు. దాంతో రైలు పవర్ కట్ అయి ట్రైన్‌ ఆగిపోతుంది. ఈ సన్నివేశం సినిమాలో భాగమే, కానీ, ఇక్కడ ఓ వ్యక్తి నిజ జీవితంలో ఇలాంటి పని చేయడానికి ప్రయత్నించాడు. అతడు చేసిన ఈ స్టంట్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఒక వ్యక్తి రైలు పైన నిలబడి ఉన్నాడు. అతని చుట్టూ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అతడు ముందుగానే రైలు నడిచేందుకు అవసరమైన కరెంట్‌ వైర్లను తగిలివున్న ఇనుప రాడ్డుకు ముందుగానే ఒక తాడు కట్టి ఉంచాడు. ఆ తాడును కిందకు లాగుతూ ఉంటే.. రైలు వేగం తగ్గుతుంది. అతుడు చేస్తున్న ఈ స్టంట్‌ మొత్తాన్ని మరికొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఎక్కడిది అనే దాని గురించి మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఈ వీడియో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు సంబంధించినదిగా భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో instaలో indianrareclips అనే ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. దీనిని మిలియన్ల మంది వ్యక్తులు వీక్షించారు. దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. వ్యూస్‌, లైకుల కోసం ఈ స్థాయి ప్రమాదకరమైన విన్యాసాలు అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు బ్రదర్‌ ఇది రీల్ లైఫ్ కాదు రియల్ లైఫ్.. ఈ స్థాయి స్టంట్స్ ప్రాణాలకే ప్రమాదం అంటూ హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..