AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా కుంభమేళాలో వృద్ధ తల్లిదండ్రులను వదిలేసిన కలియుగ కుమారులు.. ఏం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోపై చాలా మంది తమ రియాక్షన్స్ ఇచ్చారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు - సహాయం చేయడం చాలా బాగుంది, అయితే ఇదంతా వీడియో తీయటం ఈ వీడియోను ప్రపంచానికి చూపించడం ఎంత వరకు సముచితం అంటూ ప్రశ్నించారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు - ఈ ప్రపంచంలో ఇలాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు. చాలా మంది తమ వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారంటూ రాశారు..

మహా కుంభమేళాలో వృద్ధ తల్లిదండ్రులను వదిలేసిన కలియుగ కుమారులు.. ఏం జరిగిందంటే..
Old Parents In Kumbh Mela
Jyothi Gadda
|

Updated on: Jan 28, 2025 | 3:13 PM

Share

తల్లిదండ్రులు తమ పిల్లలను వారి ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి ఎలాంటి లోటు రానివ్వరు. కానీ, అదే తల్లిదండ్రులు వృద్ధులయ్యాక, ఆ పిల్లలకు భారంగా మారుతున్నారు. కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాధలకు గురిచేస్తూ అనాధశ్రమాలు, నడిరోడ్డు మీద వదిలిపెట్టి వెళ్తుంటారు. ఇలాంటి హృదయవిదారక వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే కుంభమేళాలో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ప్రయాగ్‌రాజ్ నుండి వచ్చినట్టుగా తెలిసింది. వీడియో ప్రకారం.. అక్కడి పరిసరాలు కుంభమేళాకు సంబంధించినవిగా తెలుస్తోంది. ఇందులో రాత్రి సమయంలో చలిలో వణుకుతున్న ఓ వృద్ధ జంటను చూసిన కొందరు వ్యక్తులు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి వారికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. వారిలో ఒకతను ఆ వృద్ధ జంట వివరాలు అడుగుతున్నాడు. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు.. మీకు పిల్లలు ఉన్నారా.. అని అడుగుతున్నారు.. ఇందతా మిగిలి వారిలో ఒకరు తమ సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి

కాగా, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆ వృద్ధులు ..’మాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉన్నారు. పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టారని చెప్పారు. మా ముగ్గురూ కోడళ్లు దుర్మార్గులు అంటూ ఆవేదనగా చెప్పారు.. మా నగరంలో మహా కుంభ్‌మేళ జరుగుతోందని, గంగలో పుణ్య స్నానం కోసం వెళ్తున్నామని చెప్పారు. కాగా, వారికి సహాయం చేస్తున్న వ్యక్తి తాను నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నానని, ఉదయాన్నే వచ్చి తమను ఆశ్రమానికి తీసుకెళ్తానని చెప్పారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో Instagram హ్యాండిల్ @shantanu_mediaలో షేర్‌ చేయబడింది. దీనికి క్యాప్షన్‌గా తీవ్రమైన చలికాలంలో వృద్ధ తల్లిదండ్రులను మహా కుంభ్‌లో వదిలేశారని రాశారు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోపై చాలా మంది తమ రియాక్షన్స్ ఇచ్చారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – సహాయం చేయడం చాలా బాగుంది, అయితే ఇదంతా వీడియో తీయటం ఈ వీడియోను ప్రపంచానికి చూపించడం ఎంత వరకు సముచితం అంటూ ప్రశ్నించారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు – ఈ ప్రపంచంలో ఇలాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు. చాలా మంది తమ వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారంటూ రాశారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?