పద్మ అవార్డుల విషయంలో సీఎంకు బండి సంజయ్ కౌంటర్
తెలంగాణలో పద్మ అవార్డుల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నక్సల్ భావజాలం ఉన్న గద్దర్ లాంటి వాళ్లకు అవార్డ్ ఎలా ఇస్తామని ప్రశ్నించారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు, పోలీసుల చావుకు గద్దర్ కారణమన్నారు. గద్దర్‌కు పద్మ అవార్డ్ ఇచ్చేదే లేదు.బండి సంజయ్ అవార్డులకు అర్హత ఉన్న పేర్లను రాష్ట్రం పంపించాలి. రాష్ట్రం పంపిన ప్రతి పేరును కేంద్రం పరిశీలించదు అని తెలిపారు.
అర్హత ఉన్న వాళ్లకే కేంద్రం అవార్డులు ఇస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు పేర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మరోసారి తీవ్రంగా మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్ . రాష్ట్ర నిధులతో ఇచ్చే పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారో, బిన్ లాడెన్ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం .కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే మాత్రం కుదరదుంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైరల్ వీడియోలు