AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలని బ్రౌన్‌రైస్‌ అతిగా తింటున్నారా..? అయితే, మీరు డేంజరల్‌లో పడినట్టే..!

అందువల్ల, ఇందులో తెల్ల బియ్యం కంటే ఎక్కువ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే, కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అలాగే, బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు. ఇది బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. కానీ కొంతమందికి బరువు త్వరగా తగ్గితే వ్యాధులు వస్తాయి.

బరువు తగ్గాలని బ్రౌన్‌రైస్‌ అతిగా తింటున్నారా..? అయితే, మీరు డేంజరల్‌లో పడినట్టే..!
Brown Rice
Jyothi Gadda
|

Updated on: Jan 29, 2025 | 8:23 PM

Share

ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో చాలా మంది వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ తింటున్నారు. వైట్ రైస్ తో పోలిస్తే, బ్రౌన్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదైనా మితంగా తింటేనే మేలు అంటున్నారు నిపుణులు. ఆరోగ్యమే అయినప్పటికీ అతిగా తింటే అది అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే, బ్రౌన్ రైస్ ఎక్కువ తింటే కూడా ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ ఫైబర్ తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయని అంటున్నారు.. ఫైబర్ ఎక్కువైతే ప్రేగులలో అడ్డంకి ఏర్పడి కడుపు నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రౌన్ రైస్ తయారుచేసేటప్పుడు తవుడు, జెర్మ్, ఎండోస్పెర్మ్‌ను తీయరు. అందువల్ల, ఇందులో తెల్ల బియ్యం కంటే ఎక్కువ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, పిండి పదార్థం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటే, కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అలాగే, బ్రౌన్ రైస్ తింటే బరువు తగ్గుతారు. ఇది బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గిస్తుంది. కానీ కొంతమందికి బరువు త్వరగా తగ్గితే వ్యాధులు వస్తాయి.

నేషనల్ మెడికల్ లైబ్రరీ అధ్యయనం ప్రకారం, బ్రౌన్ రైస్ తిన్నవారు ఇతర ఆహారం తిన్నవారి కంటే త్వరగా బరువు తగ్గారు. బ్రౌన్ రైస్‌లో తెల్ల బియ్యం కంటే 1.5 రెట్లు ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్సెనిక్ ఒక భారీ లోహం. ఎక్కువగా తింటే శరీరానికి విషంగా పనిచేస్తుందని అంటున్నారు.. ముఖ్యంగా గర్భిణీలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్