Daily Diet: మీ డైట్ లో కోడిగుడ్లను చేర్చుకోవడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! రోజుకు ఎన్ని తినాలంటే..?
ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ మనలో చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన వాటిలో కోడిగుట్లు ఒకటి.

మనం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. కానీ ఆధునిక జీవన విధానంలో చాలా మందికి జంక్ ఫుడ్‌ను తినే అలవాటు ఉండిపోయింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే ఆరోగ్యవంతమైన ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైన ఎగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్స్ లో ప్రోటీన్
కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఒక కోడిగుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. శక్తి ఇవ్వటంతో పాటు మనం చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్లు తీసుకుంటే రోజంతా మనం యాక్టివ్‌గా ఉంటాం. ఎన్ని పనులు చేసిన అలసిపోకుండా ఉత్సాహంగా ఉండవచ్చు. కోడిగుడ్లలోని కోలిన్ అనే పోషకపదార్థం కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. పైగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కోలిన్ వల్ల మెదడులో అసిటైల్ కోలిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఫోకస్, కండరాల పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యం
కోడిగుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ల్యూటిన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి. వీటివల్ల కళ్ళలో శుక్లాలు రావడం, వయస్సుతో కలిగే కంటి చూపు తగ్గడం రాకుండా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా కోడిగుడ్లలో సెలీనియం ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మనం సీజనల్ వ్యాధులు, చిన్న కడుపు సమస్యలు తప్పించుకోవచ్చు.
రోజుకు ఎన్ని తినాలి..?
కోడిగుడ్లను ఎన్ని తినాలో అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజుకు ఒకటి నుండి రెండు కోడిగుడ్లు తినవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకుని కోడిగుడ్లు తినాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారూ, వ్యాయామం ఎక్కువగా చేస్తూ ఉంటే వారు రోజుకు 2 నుండి 4 కోడిగుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.
డైట్ లో ఎగ్స్
ఈ విధంగా కోడిగుడ్లను ఆహారంలో చేర్చుకుంటే అవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రోజూ కోడిగుడ్లు తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




