యువకుడి కంటి నుంచి ఏకధారగా నీళ్లు.. డౌట్ వచ్చిన డాక్టర్లు CT స్కాన్ చేయగా..బాబోయ్..!

కంటిలో ఎలాంటి చిన్న నలుసు పడినా కూడా అది మనల్ని తీవ్రంగా వేధిస్తుంది. అప్పుడు అది బర్నింగ్, దురద, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కంట్లో పడ్డ ఆ నలుసు బయటకు వెళ్ళే వరకు సమస్య వేధిస్తూనే ఉంటుంది. కంటిని ఇబ్బంది పెట్టే ఏ చిన్న సమస్య అయినా కూడా నిర్లక్ష్యం చేయకూడదు.. ఆ చిన్న సమస్యే ముందు ముందు తీవ్రమైన ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.. ప్రస్తుతం ఇలాంటిదే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఓ కథనంఅందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

యువకుడి కంటి నుంచి ఏకధారగా నీళ్లు.. డౌట్ వచ్చిన డాక్టర్లు CT స్కాన్ చేయగా..బాబోయ్..!
Man Tears Were Falling From
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 28, 2025 | 5:42 PM

మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగం అనగానే టక్కున చెప్పేది మన కళ్ల గురించే. అందుకే “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”… అంటారు. శరీరంలో ఏ అవయవం పనిచేయక పోయినా కష్టమే.. కానీ, కళ్లు కనిపించకపోతే మాత్రం ఈ లోకమే చీకటై పోతుంది. అలాంటి కళ్లను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంటిలో ఎలాంటి చిన్న నలుసు పడినా కూడా అది మనల్ని తీవ్రంగా వేధిస్తుంది. అప్పుడు అది బర్నింగ్, దురద, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కంట్లో పడ్డ ఆ నలుసు బయటకు వెళ్ళే వరకు సమస్య వేధిస్తూనే ఉంటుంది. కంటిని ఇబ్బంది పెట్టే ఏ చిన్న సమస్య అయినా కూడా నిర్లక్ష్యం చేయకూడదు.. ఆ చిన్న సమస్యే ముందు ముందు తీవ్రమైన ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.. ప్రస్తుతం ఇలాంటిదే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఓ కథనంఅందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

నివేదిక ప్రకారం 24 ఏళ్ల యువకుడు తన కళ్లలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్నాడు. దాంతో వియత్నాంలోని కెన్ థో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీకి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతని కళ్ళను పరిశీలించినప్పుడు, వారు తమ జీవితంలో ఎప్పుడూ చూడని, ఊహించని విషయాన్ని వారు చూశారు. కానీ, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాధిత యువకుడు మాత్రం దానివల్ల ఎలాంటి తేడా అనిపించడం లేదని చెప్పాడు. దీంతో డాక్టర్లే షాక్‌కు గురయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే…

ప్రావిన్స్కు చెందిన బాధిత యువకుడు కంటివాపు నొప్పితో డాక్టర్‌ వద్దకు వెళ్లాడు..తన ఎడమ కన్ను చూపించి తీవ్రమైన నొప్పిగా ఉందని చెప్పాడు. మొదట డాక్టర్‌ కూడా మామూలు విషయమే అనుకున్నాడు.. ఎందుకంటే అతడి కంటి చూపులో ఎలాంటి తేడా లేదు..చాలా సాధారణంగానే ఉంది. అయితే కళ్ల నుంచి చీము బయటకు రావడంతో డాక్టర్స్‌ అనుమానం వ్యక్తం చేశారు. దాంతో వెంటనే అతనికి సంబంధిత అన్ని టెస్ట్‌లు చేశారు. మెడికల్‌ రిపోర్టులో యువకుడి కంటిలో 3 అంగుళాల చాప్‌స్టిక్‌ కన్ను వెనుక ఇరుక్కున్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇది సైనస్ గోడ ద్వారా కంటిలోని మృదువైన కణజాలాల్లోకి కూరుకుపోయిందని వైద్యులు తెలిపారు. కానీ, ఆ యువకుడు మాత్రం ఆ చాప్‌స్టిక్‌ తన కంటిలోకి ఎలా వచ్చిందో తెలియదని చెప్పాడు. దాని గురించి తనకు పెద్దగా గుర్తు లేదని చెప్పాడు.. కానీ, చివరకు తనకు ఒక పార్టీలో గొడవ జరిగిందని, అప్పుడే ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ సమయంలో తనపై చాప్స్టిక్ తో దాడి చేశాడని చెప్పాడు. కాగా, అతి కష్టంమీద వైద్యులు ఆ ముక్కను కంటి నుంచి బయటకు తీసి గాయాన్ని శుభ్రం చేశారు. ఎట్టకేలకు యువకుడికి ఎలాంటి అనారోగ్య సమస్య, అపాయం లేకుండా అతన్ని రక్షించారు. లేదంటే, అతని ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..