Viral Video: రైల్లో టీ తాగుతున్నారా? అయితే, ఒకసారి ఈ వీడియో చూడండి.. జీవితంలో చాయ్ జోలికి వెళ్లరు!
టీ కంటెయినర్‌ను ఇంత ప్రమాదకరమైన రీతిలో వాష్ చేస్తున్న అతన్ని కఠినంగా శిక్షించాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలులో ప్రయాణించే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగే ఈ టీలో ఇంత ప్రమాదం ఉందా అంటూ మరొకరు పోస్ట్ చేశారు. ఇలా అపరిశుభ్రంగా తయారైన టీ, ఇతర ఆహారాన్ని ప్రజలు తినకూడదని ఒకరు చెప్పారు. రైలులో ప్రయాణిస్తూ టీ, కాఫీలు తాగడం మానేస్తానని మరో వ్యక్తి వ్యక్తి పోస్ట్ చేశాడు. ప్రజారోగ్యానికి సంబంధించి

ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ వేలాది వీడియోలు పోస్ట్ చేయబడుతుంటాయి. అందులో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా, ఇంకొన్ని మనల్ని భయపెట్టేవిగా ఉంటాయి. అవి ఏవైనా అసంభవమైన సంఘటనలు, ఊహించని పరిస్థితులు, కొందరు వ్యక్తులు చేసే సాహసాలు కలిగి ఉండటమే. అంతే కాకుండా సామాజిక, సంఘ వ్యతిరేక నేరాలకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. అందుకు సంబంధించి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్న ఓ వీడియో నెటిజన్లను షాక్‌కి గురిచేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థలో సిబ్బంది నిర్లక్ష్యం, ప్రజల ఆరోగ్యంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఇంతకీ ఈ వీడియోలో ఏం జరిగింది..? అది చూసిన నెటిజన్లు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రైల్లో చాయ్ అమ్మే ఒక వ్యక్తి టాయిలెట్ లోపల జెట్ స్ప్రేతో టీ కంటైనర్ ను కడుగుతున్నాడు. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. రైలులోని టాయిలెట్‌లో నిలబడి, వేలాది మంది ఉపయోగించే టాయిలెట్ సీట్‌పై టీ కంటైనర్ పెట్టి వాష్ చేస్తున్నాడు. కొన్ని సెకన్ల వీడియో ఫుటేజ్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయబడింది. అప్పటి నుండి వైరల్‌గా మారింది. దీంతో నెట్టింట ఈ వీడియో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
టీ కంటెయినర్‌ను ఇంత ప్రమాదకరమైన రీతిలో వాష్ చేస్తున్న అతన్ని కఠినంగా శిక్షించాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలులో ప్రయాణించే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగే ఈ టీలో ఇంత ప్రమాదం ఉందా అంటూ మరొకరు పోస్ట్ చేశారు. ఇలా అపరిశుభ్రంగా తయారైన టీ, ఇతర ఆహారాన్ని ప్రజలు తినకూడదని ఒకరు చెప్పారు. రైలులో ప్రయాణిస్తూ టీ, కాఫీలు తాగడం మానేస్తానని మరో వ్యక్తి వ్యక్తి పోస్ట్ చేశాడు. ప్రజారోగ్యానికి సంబంధించి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




