Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైకిల్‌పై 18 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు.. కారణం తెలిస్తే కన్నీ్ళ్లు ఆగవు..

ఆమెకు ముగ్గురు కుమారులు. భర్త జెబామలై చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. దాంతో శివగామి తన ముగ్గురు కుమారులతో జీవితాన్ని గడిపింది. కానీ, ఇటీవల మొదటి కుమారుడు కుటుంబంతో కలిసి వేరేచోట నివాసం ఉంటున్నాడు. రెండో కుమారుడు కూడా కొన్నాళ్లక్రితం మరణించాడని తెలిసింది. గత కొన్నాళ్లుగా శివకామియమ్మాళ్ మానసిక అనారోగ్యంతో బాధపడుతోందట. అంతేకాదు... ఆమె చిన్న కుమారుడు బాలన్ కూడా స్వల్ప మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. కానీ, రోజూ తల్లికి కావాల్సిన ఆహారం, మందులు సమయానికి అందిస్తూ.. ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు.

సైకిల్‌పై 18 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు.. కారణం తెలిస్తే కన్నీ్ళ్లు ఆగవు..
Mother's Dead Body On Bicycle
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 25, 2025 | 11:30 AM

తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరునెల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా, ఆమె కొడుకు తన తల్లి మృతదేహాన్ని 18 కిలోమీటర్లు సైకిల్‌ మోసుకెళ్లిన ఘటన ప్రజల మనసులను ఎంతగానో కలచివేసింది. త్లలి శవాన్ని సైకిల్‌పై మోసుకెళ్తున్న ఆ దృశ్యాన్ని కొందరు స్థానికులు తమ సెల్‌ఫోన్‌ల ద్వారా ఫోటోలు, వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేయటంతో అది వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

64 ఏళ్ల శివకామియమ్మాళ్ తిరునెల్వేలి జిల్లా పక్కనే ఉన్న నంగునేరిలోని నార్త్ మీనవన్ పూల్‌కు చెందినవారు. ఆమెకు ముగ్గురు కుమారులు. భర్త జెబామలై చాలా సంవత్సరాల క్రితమే మరణించాడు. దాంతో శివగామి తన ముగ్గురు కుమారులతో జీవితాన్ని గడిపింది. కానీ, ఇటీవల మొదటి కుమారుడు కుటుంబంతో కలిసి వేరేచోట నివాసం ఉంటున్నాడు. రెండో కుమారుడు కూడా కొన్నాళ్లక్రితం మరణించాడని తెలిసింది. గత కొన్నాళ్లుగా శివకామియమ్మాళ్ మానసిక అనారోగ్యంతో బాధపడుతోందట. అంతేకాదు… ఆమె చిన్న కుమారుడు బాలన్ కూడా స్వల్ప మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. కానీ, రోజూ తల్లికి కావాల్సిన ఆహారం, మందులు సమయానికి అందిస్తూ.. ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు. తరచూ తల్లిని తన సైకిల్‌పై ఎక్కించుకుని ఊరంతా తిప్పేవాడట.

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం శివకామియమ్మాళ్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. దాంతో ఆమెను తిరునల్వేలి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కానీ, అదేది అర్థం చేసుకోలేని 40 ఏళ్ల బాలన్‌ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి శివగామి మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా ఏయే ప్రదేశాలకు తల్లిని తీసుకెళ్లేవాడో.. అలాగే, ఆమె మరణం తరువాత కూడా అతడు తల్లి శవాన్ని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల హృదయాలను కలిచివేసింది. సైకిల్ తల్లి శవంతో అతడు సుమారు18 కిలో మీటర్ల దూరం ప్రయాణించాడు.

ఇవి కూడా చదవండి

అయితే, గురువారం సాయంత్రం శివగామి మృతదేహాన్ని గుడ్డతో కట్టి సైకిల్పై తీసుకెళ్లుతుండగా చూసిన వారు, ముండ్రడైపు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్‌ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..