Women Marriage: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహితలు..!
మద్యపానానికి బానిసలైన తాగుబోతు భర్తలతో విసిగిపోయిన ఇద్దరు వివాహితులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహితల వింత పెళ్లి యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారిందరు. ఇద్దరూ ఒకరినొకరు వదిలి జీవింతలేనంతగా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. చివరకి ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. ఇద్దరిలో ఒకరు భార్య, మరొకరు భర్తకు ఈ జీవితాన్ని హాయిగా గడిపేస్తామని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో వింత పెళ్లి జరిగింది. తాగుబోతు భర్తల వేదింపులతో విసిగిపోయిన ఇద్దరు వివాహితలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గోరఖ్‌పూర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ ఇద్దరు వివాహిత మహిళలకు ఇన్‌స్టాగ్రమ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడటంతో వారిద్దరూ రుద్రపూర్ దుగ్ధేశ్వర్ నాథ్ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసి జీవిస్తామంటూ ప్రమాణం చేశారు. ఇద్దరు మహిళల పెళ్లి చేసుకోవడాన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూశారు.
ఆ మహిళలు ఇద్దరికీ గతంలో పెళ్లి జరిగింది. అయితే ఇద్దరూ తమ భర్తల నుంచి విడిపోయి ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. మద్యానికి బానిసైన భర్త వేధింపులతో విసిగిపోయి.. వారి నుంచి విడిపోయినట్లు ఇద్దరు మహిళలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ప్రతి బాధలోనూ ఒకరికొకరు అండగా నిలిచేందుకు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు మహిళలు చాలా సంతోషంగా కనిపించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం..
గుంజా అనే మహిళకు రుద్రపూర్‌కు చెందిన నాథ్ బాబా అనే వ్యక్తిని గతంలో వివాహం చేసుకుంది. అయితే భర్త మద్యం సేవించి రోజూ గుంజాను వేధించడం మొదలుపెట్టాడు. మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. ఈ వేధింపులను భరించలేని గుంజా ఎనిమిదేళ్ల క్రితం అతన్ని విడిచిపెట్టి గోరఖ్‌పూర్‌లోని ప్రత్యేక గదిలో నివసిస్తోంది. ఆమె మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చూసేది. నాలుగైదేళ్ల క్రితం గోరఖ్‌పూర్‌లోని ఝంఘా పోలీస్‌స్టేషన్‌లో నివాసం ఉంటున్న కవిత అనే మరో మహిళతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా గతంలో పెళ్లి జరిగింది. భర్త మద్యపానానికి బానిసకావడంతో విసిగిపోయి అతనితో తెగతెంపులు చేసుకుంది. భర్త ఇంటి నుంచి పారిపోయి గోరఖ్‌పూర్‌లోని అద్దె గదితో ఒంటరిగా నివసించేది. ఇన్‌స్టాలో ఇద్దరికీ పరిచయంకాగా.. ఇద్దరూ తమ బాధలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
కవితకు భర్తగా గుంజ..
వారిద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఎంతో ఇష్టపడ్డారు. ఇద్దరూ ఒకరిని వదిలి ఇంకొకరు జీవించలేనంతగా బంధం బలపడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. గత పదిహేను రోజుల నుంచి తామిద్దరం పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్నామని గుంజ చెప్పింది. ముందుగా నిర్ణయించుకున్న మేరకు దుగ్ధేశ్వర్ నాథ్ ఆలయంలో గురువారంనాడు పెళ్లి చేసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. ఇద్దరం తమ ఇష్టానుసారం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. గుంజకు భర్త హోదా ఇచ్చినట్లు తెలిపారు. తాగుబోతు భర్తల వేధింపులకు ఇద్దరూ విసిగిపోయామని, నరకం చూశామని ఆవేదన వ్యక్తంచేశారు. పెళ్లి తర్వాత ఇప్పుడు ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో విడివిడిగా జీవిస్తుండగా.. ఇక ఇద్దరూ గోరఖ్‌పూర్‌లో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటామని చెపపారు. ఇద్దరూ ఏదో ఒక చోట ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తామని తెలిపారు.