Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ ఐ పవర్ అదుర్సా సుధా..? ఈ ఫోటోలో పామును కనిపెట్టగలరా..?

ప్రజంట్ ఆప్టికల్ ఇల్యూజన్స్ మాంచి ట్రెండ్‌లో ఉన్నాయ్... అలా ఓ పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం.. ఇది పక్కాగా మీ బుర్రను యాక్టివ్ చేస్తుంది. . మీ ఐ ఫోకస్ ఏ మాత్రం ఉందో తెలిసిపోతుంది. ఇంకో విషయం మర్చిపోయాం.. మన అబ్జర్వింగ్ స్కిల్స్ ఏ లెవల్‌లో ఉందో కూడా ఈ తికమక పజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

Photo Puzzle: మీ ఐ పవర్ అదుర్సా సుధా..? ఈ ఫోటోలో పామును కనిపెట్టగలరా..?
Puzzle
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 24, 2025 | 5:06 PM

పజిల్స్‌లో చాలా రకాలు ఉంటాయ్.. అయితే ఈ మధ్య ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మనల్ని రప్పాడిస్తాయి. సమాధానాలు అంత ఈజీగా చిక్కవు. గజిబిజిగా, గందరగోళంగా ఉంటాయి. తికమక పెట్టి సరదా తీర్చేస్తాయి. అదే అండీ ఈ ఫోటోలోని ఫలానా వస్తువు ఎక్కడుందో చెప్పండి..  ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి. ఈ ఫోటోలో పాము ఎక్కడుంతో కనిపెట్టండి లాంటి పజిల్స్ అనమాట. కాస్త ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉన్నవారు ఇలాంటి పజిల్స్ కనిపిస్తే.. దాని అంతు తేల్చేవరకు వదలిపెట్టారు. ఇవి మన ఐ ఫోకస్, అబ్జర్వేషన్ స్కిల్స్ ఏమాత్రం ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. అంతేకాదు మన బుర్రకు కూడా కాస్త మేత వేసినట్లు అవుతుంది. తాజాగా అలాంటి ఓ క్రేజీ పజిల్ మీ ముందుకు తీసుకొచ్చాం..

ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే.. పైన ఇచ్చిన ఫోటోలో.. చాలా మట్టి కుండలు కనిపిస్తున్నాయి కదా..! అయితే ఆ కుండల్లో ఒకదానిలో ఓ పాము గప్‌చుప్‌గా నక్కి ఉంది. అది ఎక్కడ ఉందో మీరు 30 సెకన్లలో మీరు గుర్తించాలి. కొంచెం టఫ్‌ కానీ ఫోకస్ పెడితే ఆ పామును పట్టేయొచ్చు.  మీరు ఆ పామును ఇట్టే పట్టేస్తే సూపర్ అంతే.

ఎవరైనా ట్రై చేసి ఆ పాము ఆచూకి పట్టలేకపోయారా.. డోంట్ వర్రీ.. ఆ పాము ఎక్కడుందో రౌండ్ చేసి కింద ఇస్తున్నాం. ఈ సారి ఇలాంటి పజిల్స్ ఇచ్చినప్పుడు ఇంకాస్త ఫోకస్ చేసేయండి.. సరే మరో మంచి పజిల్‌తో కలుసుకుందాం…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Puzzle Answer

Puzzle Answer