AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా ఏం ఐడియా గురూ.. కరెంట్‌, కష్టం లేకుండానే కమ్మటి చట్నీ రెడీ..! ఈ వీడియో చూస్తే..

నిజానికి కష్టపడి చేసే పని కంటే స్మార్ట్‌ వర్క్‌ ఎంతో మెరుగైనా ఫలితాలను ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా అలాంటి జుగాడ్‌ పనినే చేశాడు.. ఇక్కడో వ్యక్తి. వెల్లుల్లి, పచ్చి మిరపకాయలను రుబ్బుకోవడానికి మిక్సర్ కాకుండా ఏకంగా ట్రక్కునే ఉపయోగించాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Viral Video: వారెవ్వా ఏం ఐడియా గురూ.. కరెంట్‌, కష్టం లేకుండానే కమ్మటి చట్నీ రెడీ..! ఈ వీడియో చూస్తే..
Crushing Garlic And Chili
Jyothi Gadda
|

Updated on: Jan 28, 2025 | 6:30 PM

Share

జుగాడ్‌ విషయంలో మన భారతీయులకు సాటి ఎవరూ లేరు..! ఎంతటి తోపు తురుము ఖాన్‌ అయినా సరే.. మనలాంటి దేశీ జుగాడ్‌ చేయలేరంటే నమ్మాల్సిందే..అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ కావటం, వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోవటం సర్వసాదారణ విషయమే..! అయితే, ఇలాంటి వ్యక్తుల వీడియోలు ఇంటర్నెట్‌లో ఎప్పుడు వచ్చినా వెంటనే అవి వైరల్‌గా మారుతున్నాయి. ఈ రోజుల్లో కూడా అలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజానికి కష్టపడి చేసే పని కంటే స్మార్ట్‌ వర్క్‌ ఎంతో మెరుగైనా ఫలితాలను ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా అలాంటి జుగాడ్‌ పనినే చేశాడు.. ఇక్కడో వ్యక్తి. వెల్లుల్లి, పచ్చి మిరపకాయలను రుబ్బుకోవడానికి మిక్సర్ కాకుండా ఏకంగా ట్రక్కునే ఉపయోగించాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

సాధారణంగా అందరి ఇళ్లల్లో చట్నీ రుబ్బుకోవడానికి మిక్సర్ గ్రైండర్, లేదంటే, రాయితో చేసిన రోలును ఉపయోగిస్తారు. తద్వారా చట్నీ బాగా మెత్తబడుతుంది. అయితే, దీనికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి వెల్లుల్లి, మిర్చి చట్నీ రుబ్బుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని అందులో వెల్లుల్లి, కారం వేసి నింపాడు..ఆ తర్వాత ట్రక్కు టైరును ఆ బాటిల్‌పైకి ఎక్కించాడు. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత సీసాలో ఉంచిన వెల్లుల్లిపాయలు, కారం మొత్తగా నలిగిపోయి చట్నీ తయారైంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో ఇన్‌స్టాలో altu.faltu అనే ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. కాగా, ఇప్పటికే వీడియో లక్షల మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో వీడియోపై కామెంట్లు కుమ్మరించారు. బాబోయ్‌ చట్నీ రుబ్బుకోవటానికి మీరు చేసిన ఈ పద్ధతి అంత సాధారణమైనది కాదు అంటున్నారు. వామ్మో.. చట్నీ చేసుకు తినడానికి ఎవరైనా ఇలా రుబ్బుతారా అంటూ ప్రశ్నించారు. ఇలా గ్రైండింగ్ చేయడానికి అయ్యే ఖర్చు మిక్సర్‌తో సమానంగా ఉంటుంది అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: పోతావురా రేయ్..ఇలాంటి సినిమా స్టంట్లు చేస్తే ఖచ్చితంగా పైకే పోతావ్‌..! ఇంతకీ ఏం చేశాడంటే..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..