Talakaya Curry: తలకాయ కూరను ఈ స్టైల్‌లో వండితే.. మొత్తం లాగించేస్తారు!
తలకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఎలా వండాలో సరిగా తెలియదు. తలకాయ కూర వండటం పెద్ద ప్రాసెస్ అనుకుని ఎవరూ పెద్దగా తినరు. కానీ తలకాయ కూర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. తలకాయ కూరను సింపుల్‌గా ఇలా వండుకోవచ్చు..

తలకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఎలా వండాలో సరిగా తెలియదు. తలకాయ కూర వండటం పెద్ద ప్రాసెస్ అనుకుని ఎవరూ పెద్దగా తినరు. కానీ తలకాయ కూర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. తలకాయ కూరను సింపుల్‌గా ఇలా వండుకోవచ్చు. పెద్దగా ప్రాసెస్ ఏమీ లేదు. ఒక్కసారి ఇలా చేశారంటే.. చాలా రుచిగా వస్తుంది. మరి ఈ తలకాయ కూరను ఎలా తయారు చేస్తారు? ఈ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
తలకాయ కూరకు కావాల్సిన పదార్థాలు:
శుభ్రంగా కడిగిన తలకాయ కూర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింత పండు, ఆయిల్.
తలకాయ కూర తయారీ విధానం:
ముందుగా తలకాయ కూరను శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. నెక్ట్స్ తలకాయ కూర వేసి ఆయిల్‌లో చిన్న మంట మీద ఓ పదినిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి ముక్క బాగా ఉడుకుతుంది. ఆ నెక్ట్స్ కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి మొత్తం అంతా కలపాలి.
ఇవి కూడా వేగాక.. కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి. నీళ్లు ఉడుకుతున్నప్పుడు చింత పండు పులుసు కొద్దిగా వేసి కలిపి ఒకసారి అంతా రుచి చూసుకుని.. మరిన్ని నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. కుక్కర్‌లో అయితే కనీసం పది విజిల్స్ అయినా వేయాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు చల్లి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర సిద్ధం.