రోజుకు 2 గుడ్లు తింటే బరువు తగ్గుతారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు ఎక్కువ సమయం ఆకలి వేయనివ్వకుండా.. శరీరానికి కావాల్సిన శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయాన్నే 2 గుడ్లు తినడం శరీరానికి సరిపోతుందని అనుకోవడం పొరపాటు. శరీరానికి దాదాపు 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది.
![రోజుకు 2 గుడ్లు తింటే బరువు తగ్గుతారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/eggs-4.jpg?w=1280)
మీరు కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే రోజూ ఉదయం కనీసం 25-30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అయితే 2 కోడిగుడ్లు మాత్రమే తింటే కేవలం 12 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్ సరఫరా చేయదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రోటీన్ ఎందుకు..?
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి వేయకుండా ఉంచుతుంది. ఫలితంగా మధ్యాహ్నం చిన్న చిన్న తినుబండారాలు తినడం తగ్గుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ప్రోటీన్ సహాయపడుతుంది. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.
2 గుడ్లు ఎందుకు సరిపోవంటే..?
2 గుడ్లలో 12-14 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. శరీరంలోని కొవ్వును తగ్గించాలనుకునేవారు ఎక్కువ సమయం ఆకలిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే 2 గుడ్లతో పాటు ఇతర ప్రోటీన్ సంబంధిత ఆహారం తీసుకోవడం అవసరం.
కేలరీలు, పోషకాలు తక్కువ
2 గుడ్లలో సుమారు 140 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని పూర్తిగా అందించలేదు. శరీరానికి ఆరెంజ్, బొప్పాయి, ఓట్స్ వంటివి కూడా చాలా అవసరం.
ఏం తినాలి..?
- 3 గుడ్లు + 100-200 గ్రాముల పెరుగు + 150 గ్రాముల పండ్లు (26-33 గ్రాముల ప్రోటీన్)
- 100 గ్రాముల గ్రిల్ చేసిన పన్నీర్ + 50 గ్రాముల శెనగ పిండి రొట్టెలు (28-31 గ్రాముల ప్రోటీన్)
- 2 ఇడ్లీ లేదా 2 దోశ + 20 గ్రాముల వేరుశెనగ/కొబ్బరి చట్నీ + 1 గ్లాస్ మజ్జిగ (25-30 గ్రాముల ప్రోటీన్)
- గోధుమ పిండితో ఎగ్ రోల్ (20-25 గ్రాముల ప్రోటీన్)
- మెంతి పరాటా + 150 గ్రాముల పన్నీర్ భుజ్జి (28-33 గ్రాముల ప్రోటీన్)
- 2 రొట్టెలు + ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయల కాంబినేషన్ వల్ల శరీరానికి సరైన ప్రోటీన్, శక్తి లభిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)