AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్‌ డైట్‌లో చింతపండు..! తినొచ్చా..? లేదా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?

ప్రస్తుత రోజుల్లో మనలో చాలా మంది డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఫుడ్ డైట్ లో ఛేంజెస్ వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. కొంచం హెల్తీ డైట్ ని ఫాలో అయితే చాలు దీన్ని కంట్రోల్‌ చేయవచ్చు. అయితే మధుమేహం ఉన్న వారు ఫుడ్స్ విషయంలో చాలా ఆందోళన చెందుతారు. ఇది సహజమే. ముఖ్యంగా చింతపండు గురించి చాలా మంది వైద్యులను ప్రశ్నిస్తున్నారు. చింతపండు తినడం డయాబెటిస్‌కి మంచిదా లేదా అనేది ప్రశ్నగా ఉండిపోయింది. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్‌ డైట్‌లో చింతపండు..! తినొచ్చా..? లేదా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
Tamarind Benefits
Prashanthi V
|

Updated on: Jan 29, 2025 | 8:40 PM

Share

చింతపండుతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పీచు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-బి, విటమిన్-సి వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన జీవన విధానంలో చాలా అవసరమైనవి. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

డయాబెటిస్ వారికి చింతపండు

డయాబెటిస్‌ బాధితులు చింతపండు తీసుకోవడం మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. చింతపండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుందట. ఇది టైప్-2 డయాబెటిస్‌ ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. చింతపండులోని ఫైబర్, హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ (HCA) వంటి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో సహాయపడతాయట.

ఇన్‌సులిన్ పెంపు

2018లో జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చింతపండు టైప్-2 డయాబెటిస్‌ రోగులలో ఇన్‌సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. దీని వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం కూడా సాధ్యమవుతుంది.

లిమిటెడ్ గా చింతపండు

చింతపండు ప్రయోజనకరమైనప్పటికీ దాన్ని లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది. దీని అధిక వాడకం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి డయాబెటిస్‌ ఉన్నవారు చింతపండును లిమిటెడ్ గా తీసుకోవాలి.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

చింతపండు శరీరంలోని ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే చింతపండు అనేక జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను నివారించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..