AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palmyra Sprout: తేగలతో మహిళలకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే షాక్ అవుతారు..!

తేగల్లో ఏం పోషకాలు ఉంటాయి..? ఈ తేగల్ని మహిళలు తప్పనిసరిగా ఎందుకు తినాలి..? డయాబెటీస్ బాధితులు తేగలను తినొచ్చా..? తేగలు అతిగా తింటే ఏం జరుగుతుంది.. పెద్దలు తేగలు గురించి చెప్పే విషయాలు నిజమేనా...? తేగలకు సంబంధించిన అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Palmyra Sprout: తేగలతో మహిళలకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే షాక్ అవుతారు..!
Palmyra Sprout
Prashanthi V
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 30, 2025 | 10:17 PM

Share

తేగల్లో విటమిన్ B, విటమిన్ C అధికంగా ఉంటాయి. 100 గ్రాముల తేగల్లో 87 కిలో క్యాలరీలతో పాటు 77 గ్రాముల నీరు ఉంటుంది. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్, నరాల సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం

తేగల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల అవకాశాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా.. ఇది శరీర కణాలను రక్షించడంతో పాటు శరీర అవయవాలకు రక్షణ కల్పిస్తుంది.

డయాబెటీస్ వారు తినొచ్చా..?

తేగల్లో అధికంగా ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. దీని వల్ల మధుమేహ రోగులు దీనిని తినొచ్చు. అయితే దీనిలోని కొన్ని పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల డాక్టర్ల సలహాతో లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవడం మంచిది.

కడుపు ఆరోగ్యం

తేగల్లో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది మలబద్ధకాన్ని తొలగించడంతో పాటు కడుపులో పేరుకునే పురుగులను నివారించగలదు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా అదుపు చేస్తుంది.

ఎముకల ఆరోగ్యం

తేగల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎముకలకు, దంతాలకు బలాన్ని అందిస్తుంది. పిల్లలకు ఇది మేలైన ఆహారం. ఇది ఎముకల సమస్యలు, కండరాల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని‌లో మెగ్నీషియం కూడా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మహిళలకు అద్భుత ప్రయోజనాలు

  • తేగలను ఉడకబెట్టి మెత్తగా చేసి బెల్లం లేదా చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయం బలంగా అవుతుంది. కొబ్బరి పాలతో కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
  • నీరసంగా ఉండే మహిళలు తేగలను ఎండబెట్టి పొడి చేసి బెల్లం లేదా తాటి సిరప్‌తో కలిపి తీసుకుంటే శక్తి వస్తుంది.
  • ప్రసవం తర్వాత తేగలను తినడం వల్ల పోయిన పోషకాలు తిరిగి వస్తాయి. పైగా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తేగలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఎ, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 40 ఏళ్లు పైబడిన మహిళలు తరచుగా ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. ఇది రుతుక్రమం ఆగిపోయే సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. తేగలను ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, సరైన రక్త ప్రసరణను నిర్ధారించడానికి, శరీరానికి ఆక్సిజన్ అందించడానికి సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!