శొంఠి వాడకంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు, వాపులు నుండి ఉపశమనం కలిగిస్తాయి. శొంఠి పొడిని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. ఇందుకోసం ముందుగా శొంఠిని వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, మెంతులు, వాము, ధనియాలు వేయించుకొని. అన్ని కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో కలుపుకొని తింటే..

శొంఠి.. అల్లానికి ప్రతిరూపమే ఇది..అల్లాన్ని ఎండబెడితే తయారయ్యేదే శొంఠి. శొంటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుందని చెబుతున్నారు.. ముఖ్యంగా బరుగు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇందుకోసం గోరువెచ్చటి నీళ్లలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్, అర చెంచా శొంఠిపొడి కలిపి తాగితే మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారని అంటున్నారు. ఒక గ్లాసు నీళ్లలో అర చెంచా శొంఠిపొడి కలిపి మరిగించాలి. ఆ తర్వాత అందులో రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, తేనే కలిపి తాగినట్లయితే మీ శరీరంలో కొవ్వును కరిగించుకోవచ్చు.
అంతేకాదు.. శొంఠిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను ఐస్‌లా కరిగిస్తుంది. శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు, వాపులు నుండి ఉపశమనం కలిగిస్తాయి. శొంఠి పొడిని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. ఇందుకోసం ముందుగా శొంఠిని వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, మెంతులు, వాము, ధనియాలు వేయించుకొని. అన్ని కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో కలుపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు.
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా శొంఠి పొడి కలుపుకుని తాగడం వల్ల మన జీవ క్రియ మెరుగుపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మన చర్మాన్ని మరమ్మతు చేయడంలోనూ రక్షించడంలోనూ ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరు వెచ్చట నీటిలో శొంఠి పొడి, తేనే, దాల్చిన చెక్క, నిమ్మరసం కలిపి తాగితే చాలా రుచికరంగా ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)