Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు మాత్రం బాదం పప్పులను తినకూడదు.. తింటే ఎంత డేంజరో తెలుసా..?

మన ఆరోగ్యానికి మేలు చేసే నట్స్‌, డ్రైఫ్రూట్స్‌లో బాదం ఒకటి. బాదం పప్పు రుచి అందరికీ నచ్చుతుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. కేవలం రుచిలో మాత్రమే కాదు.. బాదంలో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాలైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బాదం పప్పును నానబెట్టి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, ఎన్నో లాభాలున్నప్పటికీ బాదం పప్పును కొందరు తినకూడదని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంను ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jan 29, 2025 | 3:24 PM

నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్నతనంలోనే హైబీ సమస్యను ఎదుర్కొటున్నారు. ఈ అధిక రక్తపోటు కారణంగా హార్ట్‌ ఎటాక్‌, హార్ట్‌ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల్ని కలిగిస్తుంది. అయితే మీరు కూడా హైబీపీ పేషెంట్ అయితే మాత్రం బాదం పప్పును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ మందులను వాడుతూ బాదం పప్పులను తినడం చాలా డేంజర్‌ అంటున్నారు.

1 / 5
మైగ్రేన్ తో బాధపడేవారు బాదం తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. మైగ్రేన్‌ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం, వికారం, వాంతులు, అలసట వంటి సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే కాలుష్యం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం లేకపోలేదు.

3 / 5
ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపునొప్పి ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా తినకూడదు. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది.

4 / 5
అధిక బరువు లేదా ఉబకాయ సమస్యతో బాధపడేవారు సైతం బాదాం పప్పుల జోలికి పోకూడదు. బాదం పప్పులో కేలరీలు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి త్వరగా బర్ను కావు దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది అందుకే వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us