- Telugu News Photo Gallery Dandruff can be reduced very simply with these tips, Check Here is Details
Tips for Dandruff: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో బైబై చెప్పేయండి..
చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు సమస్య ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. చుండ్రుతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కాలను ట్రై చేశారంటే చాలా ఈజీగా చుండ్రును తగ్గించుకోవచ్చు. మరి అవేంటో చూసేయండి..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 29, 2025 | 10:06 PM

అందాన్ని పెంచడంలో జుట్టు మరింత సహాయ పడుతుంది. హెయిర్ స్టైల్స్‌తోనే అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది. జుట్టు అంటే అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే అంత ఈజీగా పోదు. దీన్ని వదిలించుకోవడానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. చుండ్రు భుజంపై, ముఖంపై పడుతూ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. జుట్టు కూడా నిర్జీవంగా మారి రాలిపోవడం జరుగుతుంది.

చుండ్రును తగ్గించడంలో నిమ్మరసం ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. మీరు తరుచుగా ఉపయోగించే ఆయిల్‌లో నిమ్మరసం కలిపి.. రాస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. వారంలో రెండు సార్లు ట్రై చేస్తే.. చుండ్రు పోతుంది.

తులసి ఆకులు, వేప ఆకులతో కూడా చుండ్రును ఈజీగా పోగొట్టుకోవచ్చు. తులసి ఆకులు లేదా వేప ఆకుల్ని నీటిలో మరిగించి తల స్నానం చేసుకునేటప్పుడు పై నుంచి వేసుకుంటే.. చుండ్రు సమస్య తగ్గుతుంది. వేపాకు పేస్టు కూడా తలకు అప్లై చేయవచ్చు.

అదే విధంగా పెరుగు, మెంతి గింజలతో కూడా చుండ్రును తగ్గించుకోవచ్చు. రాత్రి పూట పెరుగులో మెంతులు నానబెట్టి ఉదయాన్నే పేస్టే చేసి తలకు అప్లై చేస్తే.. చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు సిల్కీగా, మెత్తగా మారుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























