AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచుతున్నారా..? ఏమవుతుందో తెలిస్తే..

వాస్తు.. నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాస్తు ప్రధాన అంశంగా మారింది. ఇల్లు, ఆఫీసు, పని చేసే ప్రదేశం అన్ని చోట్ల తప్పనిసరిగా వాస్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇల్లు ఏ దిక్కున నిర్మించుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇంటి ముందు ఎలాంటి చెట్లు పెంచుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారాం, గేట్ దగ్గర ఎలా ఉండాలి..? ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచుకోవచ్చు...? ఇలాంటి చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. అయితే, ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచితే ఏమవుతుందో తెలుసా..?

Jyothi Gadda
|

Updated on: Jan 29, 2025 | 6:39 PM

Share
ప్రతి ఒక్కరూ ఇంటిని అందంగా ఉంచుకోవటానికి ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగా చాలా మంది ఇంట్లో వివిధ రకాల మొక్కలు, చెట్లను నాటుతుంటారు. ఇంట్లో చెట్లు, మొక్కలు పెంచితే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహిస్తుంది. కానీ, కొన్ని మొక్కలు ఇంటి ఆవరణలో పెంచకూడదని చెబుతుంటారు. అవి మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అలాంటిదే బొప్పాయి చెట్టు.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతారు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా విత్తనం పడి చెట్టు మీ ఇంటి ముందు పెరిగితే ఆ మొక్కను పీకి వేరే చోట నాటాలని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే దాంతో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.

2 / 5
వాస్తు నిపుణులు చెబుతున్న మేరకు..ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు. అయితే, దీని వెనుక ఓ బలమైన కారణం ఉందని చెబుతున్నారు.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు.. అంతేకాదు ఇంటి ముందు, ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటడం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని అంటున్నారు.

4 / 5
అంతేకాదు.. వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

5 / 5