Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?

నెయ్యితో మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది దీనిని సరిగ్గా ఎలా తీసుకోవాలో తెలియక ఎక్కువగా తక్కువగా తీసుకుంటారు. కొందరూ అయితే మానేస్తారు కూడా. నిజానికి నెయ్యిని ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.

నెయ్యిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?
Ghee Benefits
Follow us
Prashanthi V

|

Updated on: Jan 30, 2025 | 10:18 PM

నెయ్యిలో విటమిన్ A, D, E, K, ఒమేగా-3, ఒమేగా-6 వంటి పీచు తత్వాలు, లినోలిక్ యాసిడ్, బ్యుటిరిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. నెయ్యి మన వంటలో అత్యధికంగా ఉపయోగిస్తాము. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యి గోరువెచ్చని నీటిలో వేసి తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరానికి ఎంతో లాభం ఉంటుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య పరిష్కరించబడుతుంది. నెయ్యిలో ఉన్న బ్యూట్రిక్ యాసిడ్ పేగులకు ఆరోగ్యకరంగా పనిచేస్తుంది.

ఈ విధంగా నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీవక్రియ బలపడుతుంది. మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కాలేయం శుభ్రపడి చర్మం మెరుస్తుంది. నెయ్యి శరీరానికి తేమను అందిస్తూ.. చర్మాన్ని మృదువుగా, కాంతిగా మారుస్తుంది.

నెయ్యి ఎముకల బలాన్ని పెంచుతుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఉండడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. మెదడుకు కూడా మంచి పోషణ అందుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు కూడా నెయ్యి ఎంతో మంచిది. ఎదిగే పిల్లలకు రోజుకు ఒక స్పూన్ నెయ్యి గోరువెచ్చని నీటిలో కలిపి తాగించాలి.

బరువు తగ్గాలనుకునే వారు కూడా నెయ్యిని తీసుకోవచ్చు. నెయ్యిలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఈ విధానం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే దీనిని ఒక స్పూన్ మాత్రమే తీసుకోవడం సరిపోతుంది. ఎక్కువగా తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.

సాధారణ బరువు, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను కొనసాగించాలనుకునే వారికి నెయ్యి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఊబకాయం ఉన్నవారు దీనిని లిమిటెడ్ గా తీసుకోవాలి. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టరుకు సలహా తీసుకుని మాత్రమే నెయ్యి వాడాలి. నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వలన కాలేయం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి సరైన విధానంలో నెయ్యిని ఉపయోగించడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)