AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti-Cancer Diet: ఇది పండు కాదు అమృతం.. రోజుక్కటి తింటే చాలు జీవితంలో క్యాన్సర్ రానివ్వదు

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో కివి పండ్లు ముఖ్యమైనవి. వీటిల్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజుకొక్కటి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పైగా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా నివారిస్తుంది..

Anti-Cancer Diet: ఇది పండు కాదు అమృతం.. రోజుక్కటి తింటే చాలు జీవితంలో క్యాన్సర్ రానివ్వదు
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివి పండ్లకు దూరంగా ఉండాలి. వాస్తవానికి కివిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిపై మరింత ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే.. కిడ్నీ రోగులు ఆహారంలో పొటాషియం తక్కువ మొత్తంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
Srilakshmi C
|

Updated on: Jan 31, 2025 | 1:49 PM

Share

కివీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పోషకాల గని. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. వీటితోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కివీ పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యానికి మంచిది

కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కివీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ పండ్లలో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

కివీ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఈ పండులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివీ పండులోని న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కివీ పండు తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్రలేమి ఇది మంచి ఎంపిక.

ఇవి కూడా చదవండి

కివీ పండులో ఆస్తమాకు చెక్‌

కివీ పండులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు.. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. కివీ పండు తినడం వల్ల శ్వాసకోస సమస్యలు, దగ్గు తగ్గిస్తుంది. కివీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, కివీ పండ్లను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక

కివీ పండులో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలని లేదా అదే బరువును కొనసాగించాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఆహారం. ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో అతిగా తినడాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచవు. మధుమేహం ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

కంటి ఆరోగ్యానికి మంచిది

కివీ పండ్లలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి వయసు సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కివీ పండులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె
షుగర్ పేషెంట్లు కూడా తినే ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..
ఆధార్ కార్డులపై కేంద్రం కొత్త అప్డేట్.. ఐదు భారీ మార్పులు..
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
శరీరాన్ని శుద్ధి చేసే పాతకాలం నాటి కమ్మని ఉలవ కట్టుచారు..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త..
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
టెన్త్ విద్యార్థులకు ఊరట.. పాస్ మార్కుల నిబంధనపై CBSE కీలకనిర్ణయం
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? ఆ మహమ్మారి జబ్బుతో..
భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి
భూములు అసలెన్ని రకాలు.. కొనే ముందు కచ్చితంగా ఈ నిజాలు తెలుసుకోండి
పెరుగు రుచిగా, గడ్డలా రావాలంటే ఇలా చేయండి..
పెరుగు రుచిగా, గడ్డలా రావాలంటే ఇలా చేయండి..
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు
ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..
ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..