AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దుర్మార్గుడా.. భార్య పోరు పడలేక.. కన్న తండ్రిని ఎత్తి కాల్వలో పడేసిన కొడుకు! తర్వాత జరిగిందిదే

వృద్ధుడైన తండ్రిని పోషించేందుకు కన్న కొడుకుకి, అతడి భార్యకు మనసు రాలేదు. దీంతో తండ్రిని ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నమ్మకంగా కారులో తీసుకెళ్లి కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కాల్వ ఒడ్డున తండ్రిని కారు దిగమని చెప్పి.. తాను కూడా దిగి.. చేతులతో తండ్రిని అమాంతం ఎత్తి కాల్వలోకి విసిరేసి చేతులు దులుపుకున్నాడు. కానీ అంతలోనే..

ఓరి దుర్మార్గుడా.. భార్య పోరు పడలేక.. కన్న తండ్రిని ఎత్తి కాల్వలో పడేసిన కొడుకు! తర్వాత జరిగిందిదే
Son Thrown Father Into Canal
T Nagaraju
| Edited By: |

Updated on: Jan 31, 2025 | 10:38 AM

Share

పల్నాడు, జనవరి 31: వృద్దాప్యంలో కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కనికరం లేకుండా కన్నతండ్రిని కాలువలో తోసి చంపేశాడు. పల్నాడు జిల్లా నూజెండ్లకు చెందిన గంగినేని కొండయ్య విలువైన ఆస్తి ఉంది. కొన్నేళ్ళ క్రితం ఇరవై లక్షల రూపాయల ఆస్తిని అమ్మేసి కొండయ్య, తన భార్య శాంతమ్మతో కలిసి పెద్ద కొడుకు వెంకటేశ్వర్లు వద్దకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో కొండయ్య భార్య శాంతమ్మ కాలం చేసింది. అప్పటి నుండి కొండయ్య వెంకటేశ్వర్లు దంపతులకు భారంగా మారాడు. వెంకటేశ్వర్లు తరుచూ తండ్రి విషయమై భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే నిన్న కూడా వెంకటేశ్వర్లు భార్యతో గొడవ పడ్డాడు. తీవ్రస్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఇంటిలో నుండి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు కారు మాట్లాడుకొని తన తండ్రిని తీసుకొని ఈపూరు వైపు వెళ్ళాడు.

ఈపూరు మండలం భద్రుపాలెం వద్దకు వెళ్ళిన తర్వాత సాగర్ కాలువ కట్టపై కారును నిలిపేశాడు. తన తండ్రి కొండయ్యను కారులో నుండి దించి.. చేతులతో ఎత్తి కాలువలోకి విసిరేశాడు. ఇదంతా దూరంగా నుంచి చూస్తున్న స్థానిక రైతులు హుటాహుటిన అక్కడికి వచ్చి వెంకటేశ్వర్లను పట్టుకున్నారు. అప్పటికే కాలువలో మునిగిపోతున్న కొండయ్య.. రక్షించడని వేడుకుంటున్న కొండయ్యని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

దీంతో కళ్ల ముందే కొండయ్య నీట మునిగి మృతి చెందాడు. వెంకటేశ్వర్లును పట్టుకున్న స్థానికులు చితకబాది.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు వెంకటేశ్వర్లను అప్పగించారు. కొండయ్య మృతదేహాన్ని బొమ్మరాజుపల్లి వద్ద కనుగొన్నారు. అయితే తండ్రితో పాటు తాను చనిపోవాలని అనుకున్నట్లు వెంకటేశ్వర్లు పోలీసులకు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసు.. దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
ఒక్క ఫోటోతో రూమర్స్‏కు చెక్ పెట్టిన మేకర్స్..
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..