Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!

బీచ్‌లో క్యాజువల్‌గా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అసాధారణంగా ఏదైనా కనిపిస్తే..అదేదో చెత్తాచెదారం అనుకుంటాం..అయ్యో బీచ్‌ అంతా మురికి కూపంగా మారిపోతోందని సంబంధిత అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంటారు. కానీ, అలాంటి ఒక దృశ్యం ఇక్కడో వ్యక్తి అదృష్టాన్ని మార్చేసింది. ఓ సాయంత్ర సమయంలో అలా బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి గుర్తు తెలియని వింత వస్తువు ఒకటి కనిపించింది. అదే ఇప్పుడు ఇంటర్‌నెట్‌ వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ఇంతకీ అదేంటంటే..

బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!
66 Million Year Old Fish Vomit
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 29, 2025 | 7:48 PM

డానిష్ నివాసి, ఔత్సాహిక శిలాజ పరిశోధకుడు అయిన పీటర్ బెనికే ఓ ఆశ్చర్యకర విషయాన్ని కనుగొన్నాడు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన డెన్మార్క్‌లోని సీలాండ్ ద్వీపంలోని స్టీవెన్స్ రాక్స్ దగ్గర అతడు క్యాజువల్‌ వాక్‌ చేస్తుండగా, అతని కాలికి ఏదో వింత వస్తువు తగిలింది.. అతను దాన్ని అసాధారణమైనదిగా గుర్తించాడు..అందులో ఏదో ప్రత్యేకత ఉందని భావించాడు.. వెంటనే అందులో కొంత బాగాన్ని సేకరించి పరీక్షల నిమిత్తం తూర్పు సీలాండ్ మ్యూజియంక తీసుకెళ్లాడు. విచారణలో బయటపడింది అపూర్వం.. అద్భుతం గుర్తించారు. ప్రస్తుతం ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అదేంటంటే.. డైనోసార్ యుగానికి చెందిన శిలాజ వాంతిగా డెన్మార్క్‌ పరిశోధకులు గుర్తించారు. తూర్పు జీలాండ్ మ్యూజియం సోమవారం ఈ ఆవిష్కరణ గురించి సమాచారాన్ని ప్రకటించింది. కోపెన్‌హాగన్‌కు దక్షిణంగా యునెస్కో జాబితా చేసిన స్టీవెన్స్ రాక్స్‌లో స్థానిక శిలాజ వేటగాడు ఇలాంటి అసాధారణమైన పదార్థాన్ని గుర్తించటం చూసి వారంతా ఆశ్చర్యపోయారు.. ఇది సముద్రపు కలువ ముక్కల నుండి తయారవుతుందని చెబుతారు. ఇది 66 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన చేపల జీర్ణం కాని వాంతిగా వారు గుర్తించారు. అలాగే అందులో సున్నం మిశ్రమం లాంటిది కూడా దొరికిందని చెప్పారు.

జెయింట్ డైనోసార్‌లు భూమిపై జీవించిన కాలంలో సముద్రంలో నివసించే చేప సముద్రపు లిల్లీ అనే జీవిని తిని జీర్ణించుకోకుండా ఉమ్మి వేసింది. ఒకటి కాదు రెండు రకాల సముద్రపు లిల్లీలను చేపలు తిని జీర్ణించుకోలేక ఉమ్మివేసినట్లు మ్యూజియంలోని నిపుణుల పరిశోధనలో తేలింది. ఈ వాంతి 140 మిలియన్, 60 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ యుగం నుండి వచ్చింది. టైరన్నోసారస్, ట్రైసెరాటాప్స్ వంటి భారీ డైనోసార్‌లు భూమిని పాలించిన సమయం కూడా ఇదేనని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: దర్జాగా కారును కొట్టేశాడు.. తీరా లోపల చిన్నారిని చూసి ఏం చేశాడో తెలిస్తే…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..