Budget 2025: ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు.. భారీగా తగ్గనున్న మందుల ధరలు
Budget 2025: పార్లమెంట్‌లో కేంద్ర వార్షిక బడ్జెట్ 2025ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి వారితో పాటు ఖరీదైన వైద్య చికిత్సలో వాడే మందుల ధరలపై కీలక ప్రకనట చేశారు. క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 మందులను ప్రాథమిక కస్టమ్ ..

బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 మందులను ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయించనున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దాని చికిత్స కోసం మందులు చౌకగా ఉంటాయి. దీంతో పాటు ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై కస్టమ్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
కస్టమ్స్ సుంకం నుండి పూర్తిగా మినహాయించబడిన మందుల జాబితాలో 36 రకాల ప్రాణాలను రక్షించే మందులు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో 37 మందులు, 13 కొత్త పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌లు (రోగులకు ఉచితంగా మందులు సరఫరా చేసేవి) ఉంటాయి. కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి: Income Tax: పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి