- Telugu News Photo Gallery Cricket photos Tech News: Country Code, Why do phone calls in India starts with +91
Tech News: మన దేశంలో ఫోన్‌లలో ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ +91తో ఎందుకు ప్రారంభమవుతాయి?
Tech News: మనం ఎవరికైనా ఫోన్ చేసినా లేదా ఇతరులు ఎవరైనా కాల్ చేసినా మొబైల్ నంబర్‌కు ముందు +91అనే కోడ్ ఉండటం చాలా మందికి తెలిసిందే. అయితే ఈ కోడ్‌తో కాల్స్ ఎందుకు వస్తాయన్న విషయం మీకు తెలుసా? 91 కోడ్ ఎందుకు ఎంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? ఆ కోడ్ అర్థం ఏంటి? దానిని ఎవరు నిర్ణయిస్తారు?
Updated on: Feb 02, 2025 | 12:19 PM

భారతదేశంలో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే వ్యక్తుల కోసం, చాలా ఇన్‌కమింగ్ ఫోన్ కాల్‌లు +91తో ప్రారంభమవుతాయి. ఈ నంబర్ కోడ్‌తోనే కాల్స్ ఎందుకు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? +91 నుండి కాల్ వస్తే అది భారతదేశం నుండి వస్తోందని చాలా మంది భారతీయులకు తెలుసు. అయితే ఫోన్ కాల్ +91తో ఎందుకు మొదలవుతుందనేది ప్రశ్న.

నిజానికి +91 అనేది భారతదేశం దేశం కోడ్. భారతదేశానికి ఈ కోడ్ రావడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకో తెలుసుకోండి. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) అనేది ఐక్యరాజ్యసమితి సంస్థ. అక్కడి నుంచి ప్రపంచంలోని ప్రతి దేశానికి ఈ కోడ్‌ని అందజేస్తుంది.

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రపంచాన్ని 9 జోన్‌లుగా విభజించింది. ఈ 9 ప్రాంతాలలో దక్షిణ, మధ్య, పశ్చిమ, మధ్యప్రాచ్య ఆసియా ఉన్నాయి. ఈ 9 ప్రాంతాలలోకి వచ్చే అన్ని దేశాల కాలింగ్ కోడ్ +9తో ప్రారంభమవుతుంది. ఉదాహరణకు.. భారతదేశం +91, పాకిస్తాన్, +92, ఆఫ్ఘనిస్తాన్ +93.

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఒక దేశానికి దేశ కోడ్‌ను కేటాయించే ముందు దేశ జనాభా, యూనియన్‌లు, అనేక ఇతర అంశాలను పరిశీలిస్తుంది.

తెలియని నంబర్ల నుండి ఫోన్ కాల్‌లను స్వీకరించడం సరైంది కాదని భారత ప్రభుత్వం కొన్నిసార్లు ప్రచారం చేస్తుంది. ఇది స్కామ్ లేదా మోసం కాల్ కావచ్చు. ఈ కోడ్‌తో కాకుండా ఇతర కోడ్‌లతో కాల్స్ వస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. అవి సైబర్ నేరళ్ల కాల్స్ కావచ్చు. ఎందుకు మన కోడ్ కాకుండా ఇతర కోడ్‌తో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.





























