Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube: యూట్యూబ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్లు.. వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే..?

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అయిన యూట్యూబ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. దీనిలో ప్రతి ఒక్కరూ వీడియోలు షేర్ చేయవచ్చు. వీక్షించవచ్చు. తమకు నచ్చిన అంశాన్ని ఇతరులకు అందజేయవచ్చు. చదువు, ఉద్యోగం, విద్య, పర్యాటకం.. ఇలా ప్రతి విషయాన్ని దీని ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు.

Youtube: యూట్యూబ్ లో అదిరిపోయే కొత్త ఫీచర్లు.. వీటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే..?
youtube
Follow us
Srinu

|

Updated on: Feb 02, 2025 | 5:15 PM

యూట్యూబ్ కూడా తన యూజర్లకు కొత్త ఫీచర్లు అందజేస్తూ మరిన్ని మెరుగైన సేవలు అందిస్తోంది. దీనిలో భాగంగా ప్రీమియం సబ్ స్కైబర్లకు కొన్ని కొత్త ఫీచర్లను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా యూట్యూబ్ ను యూజర్లలందరూ ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. ఆసక్తి గల వారి కోసం నెల, మూడు నెలలు, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రీమియం సబ్ స్కైబర్లకు కొన్ని ప్రయోగాత్మక ఫీచర్లను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించింది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్ నయా ఫీచర్లు

  • జంప్ ఏ హెడ్ వెబ్ ఫీచర్ ద్వారా ప్రీమియం వినియోగదారులు తమ కావాల్సిన కంటెంట్ కోసం వేగంగా ఫార్వార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఫిబ్రవరి 5వ తేదీ వరకూ యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది.
  • అధిక నాణ్యత కలిగిన ఆడియోతో సంగీతాన్ని వినే అనుభవాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీ వరకూ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.
  • షార్ట్ పిక్చర్ ఇన్ పిక్చర్ అనే ఫీచర్ ద్వారా యాప్ లను మార్చేటప్పుడు కనిపించే విండోలో యూట్యూబ్ షార్ట్స్ ను ప్లే చేసుకోవచ్చు. దీని యాక్సెస్ కు ఫిబ్రవరి 19 వరకూ అవకాశం ఉంది.
  • షార్ట్ స్మార్ట్ డౌన్ లోడ్ ద్వారా ఆఫ్ లైన్ వీక్షణ కోసం సిఫారసు చేసిన షార్ట్ లను స్వయంచాలకంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ వరకూ ఈ అవకాశం ఉంటుంది. దీంతో మీ పరికరంలోకి ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి.
  • మరింత కచ్చితమైన నియంత్రణ కోసం ప్లేబ్యాక్ స్పీడ్ ఎంపికలను 4 ఎక్స్ వరకూ విస్తరించుకోవచ్చు. ఫిబ్రవరి 26 వరకూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియం సబ్ స్కైబర్లు ఇప్పుడు మద్దతు ఉన్న మ్యూజిక్ వీడియోలలో 256 కేబీపీఎస్ వరకూ అధిక నాణ్యత కలిగిన ఆడియోను ఆస్వాదించవచ్చు. యూట్యూబ్ లో నేరుగా సంగీతాన్ని ప్రసారం చేయడానికి ఇష్టపడే వారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా ఆడియోను వినే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ప్లే బ్లాక్ స్పీడ్ ఎంపికలను క్రమంగా విస్తరించుకుంటూ పోతోంది. ఈ ప్లాట్ ఫాం ప్రస్తుతం 2 ఎక్స్ వరకూ వేగానికి మద్దతు ఇస్తోంది. ఇక నుంచి దాన్ని 4 ఎక్స్ వరకూ పెంచనున్నారు. అలాగే వెబ్ లో అందుబాటులో ఉన్న జంప్ ఏ హెడ్ ఫీచర్ ద్వారా వీడియోలోని ముఖ్య భాాగాలను నేరుగా వీక్షించడానికి వీలు కలుగుతుంది. యాక్టివేషన్ పేజీని సందర్శించిన యూట్యూబ్ ప్రీమియం సబ్ స్కైబర్లు ఈ ఫీచర్లను పొందవచ్చు. అయితే ఇవి పరిమిత సమయం వరకూ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
రన్యారావుకు కోర్టులో షాక్‌.. ఏమైందంటే వీడియో
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
సూర్యుడు పూర్తిగా మాయమైతే.. అస్సలు ఏమవుతుందో తెలుసా ??
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?