IRCTC: మహా కుంభ మేళాకు ప్రత్యేక రైళ్లు.. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది..
Maha Kumbh Mela Special Trains: ఐఆర్‌సీటీసీ.. ట్రైన్ స్టార్ట్ అయినా దగ్గర నుండి మళ్ళీ వచ్చే వరకు ఎనిమిది రోజులు కూడా పూర్తి సౌకర్యాలు కూడా ఐఆర్‌సీటీసీ భరిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రయాణం చేసే భక్తులకు మహా కుంభ మేళలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌత్ సెంట్రల్..

రెండు తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభ మేళాకు లక్షలాదిగా భక్తులు తరలి వెళుతున్నారు. దానికి తగ్గట్టుగా ప్రయాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 8 నుండి మార్చి 1 వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే 181 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నదని.. ఇప్పటి వరకు సుమారు 2 నుండి 3 లక్షల మంది మహా కుంభ మేళాకు భక్తులు ప్రయాణం చేశరంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. అలాగే ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళ కోసం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది.
మహా కుంభమేళాకు రెండు ప్రత్యేక రైళ్లు వేసిన రైల్వే.. అందులో ఒకటి జనవరి 19 న వెళ్ళగా, 15 ఫిబ్రవరి న ఒక రైలు మహా కుంభమేళాకు వెళ్లనుంది. ప్రయగ్‌రాజ్‌తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర కూడా చేసే అవకాశం కల్పించిన ఐఆర్‌సీటీసీ.. ట్రైన్ స్టార్ట్ అయినా దగ్గర నుండి మళ్ళీ వచ్చే వరకు ఎనిమిది రోజులు కూడా పూర్తి సౌకర్యాలు కూడా ఐఆర్‌సీటీసీ భరిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రయాణం చేసే భక్తులకు మహా కుంభ మేళలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇది కూడా చదవండి: Budget 2025: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు మంచి రోజులు.. బడ్జెట్‌లో గుడ్‌న్యూస్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి