AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశులవారి వారఫలాలు

Weekly Horoscope (28 మే - 3 జూన్ 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి ఆదివారం (మే 28) నుంచి వచ్చే శనివారం (జూన్ 3తేదీ) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope: వారి అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశులవారి వారఫలాలు
Weekly Horoscope (28th May - 2nd June 2023)
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: May 28, 2023 | 4:00 AM

Share

Weekly Horoscope (28 మే – 3 జూన్ 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి ఆదివారం (మే 28) నుంచి వచ్చే శనివారం (జూన్ 3తేదీ) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితిలో ఆశించిన పురోగతి కనిపిస్తోంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. రుణ బాధ చాలావరకు తగ్గుముఖం పడుతుంది.  రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది సరైన సమయం. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కి కూడా అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి నిపుణులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా ముందుకు వెళతాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.  ఉద్యోగంలోనూ, బంధువర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొ లిక్కి వస్తాయి. ఐటీ నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండటం మంచిది.  పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో బాగా బిజీ అయిపోతారు.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ పరంగా చాలా బాగుంటుంది. అధికారులకు మీ సూచనలు సూచనలు సలహాలు సలహాలు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. ఐటీ రంగంలోని వారు అందలాలు ఎక్కుతారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. గౌరవ సత్కారాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి లోపిస్తుంది. పిల్లలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలలో సరదాగా కాలక్షేపం చేస్తారు.డబ్బు ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో ఒకటి రెండు వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది.
  7. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): డాక్టర్లు, లాయర్లు ఇంజనీర్లు ఐటి నిపుణులు అభివృద్ధి చెందే సూచనలున్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారం లోను కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భాగస్వాములు లేదా సహచరులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీగా ఉండవద్దు. ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వేగంగా వాహనాలను నడపటం మంచిది కాదు. ఆరోగ్యం పర్వాలేదు. మీ మాట చలామణి అవుతుంది.
  8. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకి వెళ్ళే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మిత్రులకు సహాయం చేస్తారు.  వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది.  సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు బాగా సన్నిహితులు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరికైనా వాగ్దానం చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
  9. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు బాగా ఆదరిస్తారు. వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. పిల్లలు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. బంధువుల నుంచి మాట వస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
  10. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. మీ మనసులోని ఒకటిరెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. అదృష్టం పడుతుంది.
  11. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగపరంగా, ఆర్థికపరంగా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయమార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వారాంతంలో కుటుంబ పరంగా ఒకటి, రెండు సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు దూరప్రాంతం నుంచి మంచి శుభవార్త అందుతుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళతారు.
  12. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగులు స్థిరత్వం పొందుతారు.  వృత్తి జీవితం లో బాగా నైపుణ్యంసాధిస్తారు. వ్యాపారం ఆశించిన స్థాయిలో ముందుకు వెళుతుంది. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరటానికి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. బంధుమిత్రులు మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.
  13. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు తమ తమ రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారపరంగా బాగా కలిసి వచ్చే కాలం ఇది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం చాలా అవసరం. అధికార యోగం దక్కించుకుం టారు. ఆరోగ్యం  మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితం సుఖమయంగా సాగి పోతుంది.  మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..