Astro Tips for Sunday: ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత.. ఈ ఆరు పనులు చేయవద్దు.. లేదంటే నష్టాలు తప్పవు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆదివారం రోజున కొన్ని పరిహారాలు ఉన్నాయి. వీటిని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో ఆదివారం రోజున కొన్ని పనులు చేయడం కూడా నిషేధించబడింది. ఆదివారాలు చేయకూడని ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం.

Astro Tips for Sunday:  ఆదివారం సాయంత్రం ఆరు గంటల తర్వాత.. ఈ ఆరు పనులు చేయవద్దు.. లేదంటే నష్టాలు తప్పవు..
Sunday Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2023 | 7:45 AM

సనాతన ధర్మం ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. ఈ క్రమంలో ఆదివారం గ్రహాలకధిపతి సూర్యుడికి అంకితం చేయబడింది. ప్రతిరోజూ సూర్య భగవానుని పూజించినా ఆదివారం నాడు సూర్యభగవానుని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అయితే ఆదివారాలు, మంగళవారాల్లో ప్రతికూల శక్తుల కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయని హిందువుల విశ్వాసం. ఈ రెండు రోజులలో సురక్షితంగా ఉండాలని కూడా సలహా ఇస్తారు. అంతేకాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆదివారం రోజున కొన్ని పరిహారాలు ఉన్నాయి. వీటిని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో ఆదివారం రోజున కొన్ని పనులు చేయడం కూడా నిషేధించబడింది. ఆదివారాలు చేయకూడని ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం.

  1. ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటిని శుభ్రం చేయడం తరచుగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఇంట్లో నుండి బయటకు వచ్చే చెత్తను పారవేస్తారు. అయితే ఈ రోజు పోగైన చెత్తను ఒక చోట పెట్టి.. మర్నాడు బయట పడేయండి. అంతేకాదు ఆదివారం రాగిని లేదా రాగితో చేసిన ఏదైనా వస్తువును అమ్మాలని భావిస్తే..ఆ ఆలోచన విరమించుకోండి.
  2. ఆదివారం రోజున నలుపు, నీలం లేదా గోధుమ రంగు దుస్తులు ధరించడం మానుకోండి. నలుపు రంగు శనీశ్వరుడుకి సంబంధించినదని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తండ్రి కొడుకులైన సూర్య భగవానుడు శనీశ్వరుడు అస్సలు కలిసి ఉండరు. అందుకే ఆదివారంన ఈ రంగు దుస్తులు ధరించడం మానుకోవాలి.
  3. హిందూ విశ్వాసాల ప్రకారం, ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినడం మానుకోవాలి.
  4. ఆదివారంజనావాసాలు లేని ఖాళీ ప్రదేశాలకు వెళ్లవద్దు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పాత భవనాలు ఉన్న నిర్జన ప్రాంతాలకు వెళ్లకూడదు.
  5. మీరు ఆదివారం విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తుంటే.. పశ్చిమం వైపు ప్రయాణాలను చేయవద్దు. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఈ దిశలో వెళ్లవలసి వస్తే.. ముందుగా నెయ్యి లేదా పాన్ తిన్న తర్వాత.. వెనక్కి వచ్చి..  ఆపై తూర్పు వైపుకు వెళ్లి.. అక్కడ నుంచి మీరు వెళ్లాల్సిన పశ్చిమం వైపు ప్రయాణం ప్రారంభించండి.
  6. ఆదివారం ఎవరైనా తెలియని వ్యక్తి తీపి ఆహార పదార్థాలను ఇస్తే.. వాటిని తినవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

ఇవి కూడా చదవండి