Horoscope Today: ఆర్థికంగా వారికి అంతా మంచే జరుగుతుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (September 02, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మిథున రాశి వారు ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (సెప్టెంబర్ 2, 2025): మేష రాశి వారికి ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఒకటి రెండు శుభ వార్తలు అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. మిత్రులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహా రాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, కొన్ని అనుకూలతలు కూడా ఉంటాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 1,2,3, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, సంతృప్తికరంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకో కుండా కొన్ని శుభవార్తలు వినడం, ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండి, దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో మంచి పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం బాగా అను కూ లంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా మారుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు సైతం మంచి అవకాశాలు అందివస్తాయి. చేప ట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో దూరపు బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. రోజంతా బాగా అనుకూలంగా, ఆశించిన విధంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడడం జరుగుతుంది. కొందరు బంధు మిత్రులు డబ్బుకు ఒత్తిడి తేవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలతలు పెరుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. నిరుద్యోగులకు సమయం బాగాఅనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి అపార్థాలు తలెత్తుతాయి.



