Horoscope: గత పదేళ్లలో అత్యంత ముఖ్యమైన నెల ఇది.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలంటే..
ఈ కొత్త నెలలో మీ రాశిచక్రం ఎలా ఉండబోతుంది? మీకు అదృష్టం కలిసి వస్తుందా? లేదా అని చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు. కొన్ని రాశులకు ఆర్థికంగా, వ్యక్తిగతంగా అనుకోని లాభాలు, శుభాలు ఉండవచ్చు. మరికొన్ని రాశులకు కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు. సెప్టెంబర్ నెలలో మీ అదృష్టం, ప్రేమ, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ఆధారంగా కాకుండా ఇంగ్లిష్ నెలల ప్రకారం మీరు పుట్టిన తేదీ ఆధారంగా ఈ అంచనాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించగలరు.

ఆగస్టు పోయి సెప్టెంబర్ వచ్చేసింది. పండుగలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో సెప్టెంబర్ మాస రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నెలలో కొన్ని రాశులకు అనుకోని లాభాలు, ఊహించని శుభాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో గ్రహాల కదలికలు బట్టి అన్ని రాశుల అంచనాలు ఇక్కడ ఉన్నాయి.
ముఖ్యమైన అంచనాలు:
మేష రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19): ఈ రాశి వారికి ప్రేమ జీవితం, ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గతంలో ఎదురైన నిరాశలన్నీ తొలగిపోయి, జీవితం వేగం పుంజుకుంటుంది.
వృషభ రాశి (ఏప్రిల్ 20 – మే 20): వృషభ రాశి వారు ఈ నెలలో తమ బంధాలను పునఃసమీక్షించుకోవాలి. సృజనాత్మక పనులు చేపడితే వృత్తి జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి (మే 21 – జూన్ 20): ఈ నెలలో ప్రతికూల ఆలోచనలు, భారాన్ని వదిలేయడం ముఖ్యం. ఇది భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. కీర్తి కోసం ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి (జూన్ 21 – జూలై 22): ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా పెద్ద లాభాలు ఉంటాయి. వ్యాపార పనులు ముందుకు సాగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది.
సింహ రాశి (జూలై 23 – ఆగస్టు 22): సెప్టెంబర్‌లో సింహ రాశి వారు అత్యంత అదృష్టవంతులు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ, సాన్నిహిత్యం పెరిగే అవకాశాలు ఉంటాయి.
కన్య రాశి (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22): ఈ రాశి వారికి గత పదేళ్లలో అత్యంత ముఖ్యమైన నెల ఇది. దేనిపై దృష్టి పెడితే దానిలో విజయం సాధిస్తారు. ప్రేమ విషయంలో కొత్త పరిచయాలు, పాత బంధంలో నిజాలు బయటపడే అవకాశం ఉంది.
తుల రాశి (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22): నిలిచిపోయిన పనులు, మానసిక ఒత్తిడి నుంచి ఈ నెలలో విముక్తి లభిస్తుంది.
వృశ్చిక రాశి (అక్టోబర్ 23 – నవంబర్ 21): ఈ నెలలో వృశ్చిక రాశి వారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ప్రేమ విషయంలో జాగ్రత్త అవసరం.
ధనుస్సు రాశి (నవంబర్ 22 – డిసెంబర్ 21): ఇంటికి సంబంధించిన మార్పులు ఉంటాయి. ఈ మార్పులు చాలా అదృష్టాన్ని తెస్తాయి. రాబోయే ఏళ్లలో సానుకూల ప్రభావం చూపుతాయి.
మకర రాశి (డిసెంబర్ 22 – జనవరి 19): గత వేసవి నుంచి ఉన్న సమస్యలు ఈ నెలలో తొలగిపోతాయి. తమ ఆలోచనలను, కలలను నిజం చేసుకునేందుకు ఇది సరైన సమయం.
కుంభ రాశి (జనవరి 20 – ఫిబ్రవరి 18): ఈ నెలలో వారి ఆశయాలు నెరవేరుతాయి. ప్రేమ, ఆర్థిక విషయాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోవడం ముఖ్యం.
మీన రాశి (ఫిబ్రవరి 19 – మార్చి 20): ఈ నెలలో పాత బాధలను వదిలేయాలి. ఇది భవిష్యత్తుకు కొత్త దారి చూపుతుంది. ప్రేమ, వ్యక్తిగత సౌందర్యం విషయంలో అదృష్టం బాగుంటుంది.




