Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్
అల్లు అర్జున్‌ను కలిసేందుకు ఓ అభిమాని 1758 కి.మీ సైకిల్ తొక్కి హైదరాబాద్ వచ్చాడు. బన్నీ ఆ అభిమానిని ఆత్మీయంగా పలకరించి, ఆర్థిక సాయం చేశాడు. ఈ ఘటన వైరల్ అయ్యింది. మరోవైపు, 'పుష్ప 2' తర్వాత అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి అల్లు అర్జున్ ₹800 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. మార్చి/ఏప్రిల్‌లో ఫస్ట్ లుక్ రానుంది.
పుష్ప 2 సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక వీరాభిమాని అల్లు అర్జున్ ను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ చేరుకొని తన ఫేవరెట్ హీరోని కలిశాడు. ఆ వీరాభిమాని పేరెంటో కచ్చితంగా తెలియదు కానీ నార్త్ ఇండియాకు చెందిన ఆ వ్యక్తి అల్లు అర్జున్ ని కలవడం కోసం ఏకంగా 1,758 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ హైదరాబాద్ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ కూడా ఆ అభిమానిని ఆప్యాయంగా పలకరించాడు. ఫ్యామిలీ, క్షేమ సమాచారం గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు అతనితో ఫొటోలు, సెల్ఫీలు దిగాడు. చివరగా ఆ వీరాభిమానికి కొంత ఆర్థిక సాయం కూడా చేశాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు.. కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. కానీ కొందరు నెటిజన్లు మళ్లీ ఆ అభిమాని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. వీటిని చూసిన బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో హాలీవుడ్ లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి వారణాసి సినిమా ఈవెంట్ తరహాలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వేడుక మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఉండబోతుందని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar: దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి! ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆకస్మిక మృతి!
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

