రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు కీలక నిర్ణయం ప్రకటించింది. ఇకపై పరిమితికి మించిన లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు విధిస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీలో 70 కేజీలు, ఏసీ టూ-టైర్లో 50 కేజీలు, ఏసీ త్రీ-టైర్లో 40 కేజీలు, జనరల్ బోగీల్లో 35 కేజీల వరకు లగేజీకి అనుమతి ఉంది. ఈ కొత్త నిబంధనలు ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనున్నాయి.