32 ఏళ్ల జపాన్ యువతి యూరినా నోగుచి AI సృష్టించిన వర్చువల్ క్యారెక్టర్‌ను వివాహం చేసుకుంది. ఈ బంధం తనను వాస్తవ ప్రపంచం నుంచి దూరం చేయదని, కేవలం మద్దతునిచ్చే తోడు మాత్రమేనని ఆమె పేర్కొంది. ఈ సంబంధంతో తన మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని, జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగిందని నోగుచి తెలిపింది.