Vizianagaram: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ పాన్ కార్డ్ ఫోర్జరీ.. రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందా అనే అనుమానం..

ఆడిట్ చేసే సమయంలో ఆగస్ట్ నెలకు వచ్చే సరికి ఎమ్మెల్యే బడ్డుకొండ కొత్త కియా విశాఖలోని శ్రీ లక్ష్మి ఆటోమోటివ్ లో కొన్నట్లు కనిపించింది. దీంతో వెంటనే ఆడిటర్ ఎమ్మెల్యే ను సంప్రదించి కారు నెంబర్, డిటైల్స్ కావాలని అడిగాడు. ఆడిటర్ మాటలు విన్న ఎమ్మెల్యే బడ్డుకొండ అవాక్కయ్యాడు. అసలు తాను కారే కొనలేదని, పాన్ కార్డ్ లో డిటైల్స్ ఎలా వచ్చాయో తనకు తెలియదని చెప్పాడు ఎమ్మెల్యే. అలా ఆటోమోటివ్ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే సొంత గ్రామమైన డెంకాడ మండలం మోపాడకు చెందిన బంటుపల్లి మురళీధర్ రావు గా గుర్తించారు.

Vizianagaram: నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ పాన్ కార్డ్ ఫోర్జరీ.. రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందా అనే అనుమానం..
Mla Appalanaidu Baddukonda
Follow us
G Koteswara Rao

| Edited By: Surya Kala

Updated on: Sep 05, 2023 | 7:32 PM

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పాన్ కార్డ్ ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే అప్పలనాయుడు 2022 – 23 ఆర్థిక సంవత్సరంకు సంభందించిన ఐ టి రిటర్న్స్ వేయడానికి ఆడిటింగ్ చేయగా పాన్ కార్డ్ ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్ నెల నుండి ఆడిట్ చేసే సమయంలో ఆగస్ట్ నెలకు వచ్చే సరికి ఎమ్మెల్యే బడ్డుకొండ కొత్త కియా కారు విశాఖలోని శ్రీ లక్ష్మి ఆటోమోటివ్ లో కొన్నట్లు కనిపించింది. దీంతో వెంటనే ఆడిటర్ ఎమ్మెల్యే ను సంప్రదించి కారు నెంబర్, డిటైల్స్ కావాలని అడిగాడు. ఆడిటర్ మాటలు విన్న ఎమ్మెల్యే బడ్డుకొండ అవాక్కయ్యాడు. అసలు తాను కారే కొనలేదని, పాన్ కార్డ్ లో డిటైల్స్ ఎలా వచ్చాయో తనకు తెలియదని చెప్పాడు ఎమ్మెల్యే. దీంతో వెంటనే శ్రీ లక్ష్మీ ఆటోమోటివ్ వారిని సంప్రదించగా కారు కొన్న తేదీ, కారు మోడల్, కొనుగోలు చేసిన వారి వివరాలు తెలియజేశారు.

అలా ఆటోమోటివ్ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే సొంత గ్రామమైన డెంకాడ మండలం మోపాడకు చెందిన బంటుపల్లి మురళీధర్ రావు గా గుర్తించారు. తరువాత పాన్ కార్డ్ కోసం సంప్రదించగా పాన్ కార్డ్ మీద పేరు, అడ్రస్ కొనుగోలు చేసిన బంటుపల్లి మురళీధర రావు వివరాలు ఉన్నాయని తెలిపారు. దీంతో పాన్ కార్డ్ ఐడి నెంబర్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. పాన్ కార్డ్ పై పేరు, వివరాలు కొనుగోలు చేసిన వారివే అయినప్పటికీ ఐడి నెంబర్ మాత్రం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కు చెందిన పాన్ ఐడీ కార్డు  నెంబర్ ఉందని తేలింది. దీంతో పాన్ కార్డ్ ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు ఎమ్మెల్యే బడ్డుకొండ.

బంటుపల్లి మురళీధరరావు గురించి ఎంక్వైరీ చేయగా తన ప్రతిపక్ష పార్టీ టిడిపికి చెందిన వ్యక్తి అని నిర్ధారణకు వచ్చారు. ఇక వెంటనే డెంకాడ మండల పోలీసులకు పిర్యాదు చేశారు ఎమ్మెల్యే. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు బంటుపల్లి మురళీధరరావు పై 420, 468, 471, రెడ్ విత్ 34 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే ఎమ్మెల్యే పాన్ కార్డ్ వ్యవహరంలో కేవలం మురళీధరరావు ఒక్కడే ఉండే అవకాశం లేదని, మరికొంత మంది కలిసి ఫోర్జరీ చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

అయితే అసలు ఎమ్మెల్యే పాన్ కార్డ్ ఎందుకు ఫోర్జరీ చేశారు? ఎక్కడ చేశారు? ఎలా చేశారు? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అందుకు సంభందించి పోలీసులకు కూడా మురళీధరరావు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అలాగే పాన్ కార్డ్ ఫోర్జరీ చేసిన మురళీధర రావు ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు అవ్వడం అలాగే ఇద్దరు వేరు వేరు పార్టీల్లో కావడంతో రాజకీయ, ఆర్థికపరమైన కుట్ర కోణంలో భాగంగానే ఇలా పాన్ కార్డ్ ఫోర్జరీ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏదైనా పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపితే కానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..