Andhra Pradesh: పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు! ఆ తర్వాత జరిగిందిదే
పండగ పూట ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో అనుకోని విషాదం చోటు చేసుకుని అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. ఒకేతల్లి కడుపున పుట్టిన ఆ ఇద్దరన్నదమ్ములను ఒకేరోజు గంట వ్యవధిలో మృత్యువు ఆవహించింది. తొలుత అన్న గుండె ఆగిపోయింది. దీంతో కలత చెందిన తమ్ముడు గుండె అన్న మరణ వార్తను భరించలేక అదీ ఆగిపోయింది..
చీరాల, జనవరి 15: సంక్రాంతి పండుగరోజు ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. తొలుత గుండెపోటుకు గురైన అన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ఆసుపత్రిలో మృతి చెందిన అన్న వివరాలు అందిస్తూ తమ్ముడు కూడా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గంట వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆ విషాద ఘటన బాపట్ల జిల్లా చీరాల గొల్లపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది.
చీరాల మున్సిపల్ పరిలోని గొల్లపాలెం చెందిన 40 ఏళ్ళ గొల్లప్రోలు గంగాధర్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు,స్నేహితులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే గంగాదర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడిఉన్న అన్న గంగాధర్‌ను సూచి గొల్లప్రోలు గోపి (33) కన్నీరుమున్నీరయ్యాడు. అన్న గంగాధర్ వివరాలను ఆసుపత్రిలో సిబ్బందికి వివరిస్తున్న క్రమంలో తమ్ముడు గోపి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అన్న మృతిని తట్టుకోలేని తమ్ముడు గోపి ఆసుపత్రిలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
వైద్యులు వెంటనే వైద్య చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కేవలం గంట వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందడంతో గొల్లపాలెంలో విషాధచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అన్నదమ్ములు ఒకేసారి కేవలం గంట వ్యవధిలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు తరలివస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.